పుట:Gutta.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాయపూనినపుడు తనపేరు ముందర "త్రైత సిద్ధాంత ఆదికర్త" అని వ్రాయడమైనది. అద్వైత సిద్ధాంతమును ఆదిశంకరాచార్యుడు ప్రకటించినట్లు, రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రకటించినట్లు, మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతమును ప్రకటించినట్లు, ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతమును ప్రకటించాడు. త్రైత సిద్ధాంతమును ఆధారము చేసుకొని భగవద్గీతను త్రైత సిద్ధాంత భగవద్గీతగా వ్రాయడము జరిగినది.


సాధారణ మనిషిగా జీవమును సాగించు ప్రబోధానంద సమాజములో సామాన్య మనుషులలో ఏ గుర్తింపూ లేకుండా బ్రతుకు చుండెను. అందువలన సామాన్య మనుషులు ఆయనను సర్వ సాధారణముగా చూచినా, కనిపించని దయ్యాలు, దేవతలు ఆయనను గొప్పగ చూచెడివి. ఆయన మాటను గౌరవించేవి. త్రైత సిద్ధాంత భగవద్గీత ఆయన ఐదవ రచనగా వచ్చింది. అప్పటికే ఆయన ఫోటో ముందర కూర్చున్న వారికి కొన్ని రకముల రోగములు పోయేవి. ఇతరులలోనికి పూనకము వచ్చిన దేవతలు సహితము ఆయనకు నమస్కరించి మాట్లాడేవారు. చెప్పినమాట వినేవారు. బయటికి ఇదొక వింతగా ఉండినా ప్రబోధానంద మాత్రము తనను సాధారణ మనిషిగానే లెక్కించుకొనేవాడు. ఆయన ముఖ్యముగా ఒక మాట చెప్పెడివాడు. అదేమనగా "నేను చెప్పునది భూమిమీద ఇంత వరకు ఎవరూ చెప్పనిదిగా ఉంటుంది. అలాగే నేను వ్రాయునది ఇంతవరకు భూమిమీద ఎవరూ వ్రాయనిదిగా ఉంటుంది." నిజముగా ఆయన చెప్పే జ్ఞానముగానీ, వ్రాసే వ్రాతగానీ ఎవరిచేతా తెలియబడనిదిగా ఉంటుంది. దీనిని ఇంతటి రహస్యమును మీరు ఎలా చెప్పగలుగుచున్నారని ఎవరైనా

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/18&oldid=279903" నుండి వెలికితీశారు