పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

మందులు - వృత్తులు - విశ్వాస్వాలు - దేవత్రలు - ఆటలు ఇలా ఎన్నో విషయాలపై మంచి పరిశోధన గావించబడిన గ్రంధం. దీనిలో శిల్పం చిత్రలేఖనం, సంగీతం, నాట్యం, కవిత్వం మొదలగు లలితకళ్లుకూడా శాస్త్రీయదృక్పధంతో పరీశీలనచేసి చెప్పారు.

తెలుగు సంస్కృతికి, ప్రత్యేకించి తెలుగు జానపదకళలకు ఈ విధంగా వీరు చేసిన మహత్తరమైన సేవ బహుధా ప్రశంసనీయం. గ్రంధం ప్ర్రారంభంనుంచి అంతంవరకూ ఆసక్తికరంగా నడిపించిన రచనా కౌశలము నిస్సందేహంగా అభినందించతగింది. అట్లాంటి ఉత్తమపరిశోధనచేసిన శ్రీ రెడ్డిగారిని అవశ్యం మెచ్చితీరాలి.

--డా. పి. వేణుగోపాలరావు, M. A. Phd.

రీజనల్ డైరక్టర్, అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్, మద్రాసు.

రెడ్డిగారిగ్రంధం జానపద కళలకు బహుమానం

ఈగ్రంధంలోని 3వ భాగంలో జానపదకళలు, ఆచారాలు, అలవాట్లు విద్య, వైద్యం వగైరా ఎన్నోవిషయాలు చక్కగాచెప్పేరు. వ్యాధుల నివారణకు ప్రకృతిసిద్ధమైన వస్తువులతో నేటివ్ వైద్యం ఎలాచేస్తారో చక్కగా సేకరించి చెప్పేరు. నిజంగా ఇది అభినందించదగినంత గొప్పగా వుంది. ఆరవచాప్టర్ లో జానపదకళలతోపాటు లలితకళలను పోల్చిచూపించి రచయిత ఇరుపక్షాలపై తనకున్న ఆదిక్యతను, అదికారాన్ని, శక్తిని నిరూపించుకున్నారు. 12వ ఛాప్టర్ లో జానపదుల అలవాట్లు, అచారాలు వగైరాలు సవిర్శతో పరామర్శించి "ఇవన్నీ వారిని సుఖవంతులుగానూ, శాంతివంతులుగానూ చేయడానికి ఏర్పాటుచేసినవే అనే రచయితమాట అక్షరసత్యం. ఈ గ్రంధం చాలా సరళసుందరంగా వ్రాయబడింది. ఇంత సమాచారం సేకరించిన రచయితకృషి అద్భుతతి ఇంతపెద్దవిషయాన్ని చేబట్టి ఛేధించడం రచయిత పట్టుదలకు ఆసక్తికి నిదర్శనం. ఇద్ జానపద కళారంగానికి ఒక గొప్ప బహుమానమనే చెప్పాలి. ఒక్కజానపద కళారంగానికేకాదు తెలుగు సాహితీసాంస్కృతిఈ మతల్లిమెడలోచేరిన మరోమంచి మణిహారం.

--ప్రొఫెసర్. డా. షేక్ మస్తాన్ M. A. Phd.

ఆలిఘర్ యూనివర్సిటీ.