పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రముఖుల అభిప్రాయాలు

బహుకళా సురభిళ భావుక పట్టభధ్రుడు

పడాల రామకృష్ణారెడ్డి

శ్రీ రామకృష్ణారెడ్డి బహుకళాసురభిళహృదయుడైన భావుక పట్టభద్రుడు. వృత్తిలో పరమ నాగరీకుడేగాని ప్రవృత్తిలో వట్టి జానుతెనుగు జాతి జానపదుడు. వివిధవిషయాల్లో చొరవగా ప్రవేశిస్తాడు. ప్రావీణ్యం సంపాదిస్తాడు. అవగాహన చేసుకుంటాదు. అనుభవం మూటగట్టుకుంటాడు. ఆలోచించి పలుకుతాడు. పలికిన పలుకున ఆలోచిమపచేశ్తాడు. రెడ్డిగారిగ్రంధంలో ఉయించుమించు మన సర్వ జానపద కళారూపాలగురించీసంగ్రహ పరామర్శవుంది. అతని పూనికలో ఒక ఏకాగ్రతవుంది. అవగాహనలో సమగ్రతవుంది. సకలజానపదసరస్వతి సర్వాంగీణ పరిష్వం గంగా ఒక పరిశోధననిబంధాన్ని వెలయింప సమకట్టేవారికి మార్గదర్శకంకాగల లక్షణాల గ్రంధమని ఘంటాపధంగా చెప్పగలను. పలికిన పలుకల్లా రంగస్థలప్రవేశ్వంచేసిన పాత్రధారి పలుకులావుందిగాని వట్టినేపధ్య ప్రవచనంలాగునా, ఆకాశభాషితంమల్లేనూ లేదు. అప్పుడప్పుడు రెడ్డిగారు చెణుకులు విసురుతాడు. అబ్బ! అని ఒక్కొక్కప్పుడు వట్టి చెణుకులుకావు. గట్టిచురకల్లాఉంటాయి. చూడ్డానికి సుందరముఖారవిందుడేగాని అతని విమర్శనాదృక్పధంమాత్రం మొగమాటంలేనిది. రచనకూడా సుగమార్ధవచనంగానూ, చమత్కారచరణంగానూ ఉంటుంది. మనసాత అతినికి నా ఆశీస్సహకృతాభినందచందనతాంబూలాలు అందిస్తున్నాను.

--జాతీయూచార్య, డా.యస్. వి జోగారావు.

ఎం.ఏ., పిహెచ్ డి., డి. లిట్ (Hon) ఆంధ్రా, అమెరికా ఆంధ్రాయూనివర్శిటీ.

జానపద కళలకు "ఎన్ సైక్లోపీడియా"

పడాల రామకృష్ణారెడ్దిగారి సిద్ధాంతగ్రంధం తెలుగు జానపదకళలపై ఒక "ఎన్సైక్లోపిడియా" అని చెప్పాలి. (విజ్ఞాన సర్వస్వము.) జానపదుల కళలు. వారి జీవితాలు- సంఘం -ఆచారాలు - పండగలు-