పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

సరస్వతీపుత్రుడు రామకృష్ణారెడ్డి

మీ కలంనుండి వెలువడిన ప్రతి అక్షరం, మీనోటినుంచి వచ్చిన ప్రతి ఉపన్యాసం ఒక క్రమప్రకారం రూపుదాల్చి శ్రోతలనాకట్టుకుంటాయి. ఇది అందరికీ లభ్యమయ్యేదికాదు. మీరు సరస్వతీ కటాక్షం పొందిన మహనీయులు. మీ హృదయం కళాహృదయం. అసలు మీ రూపమే కళాస్వరూపం. మీఓర్పు, మాటలకూర్పుమరొకరికుండవేమో అనిపిస్సుంది. అన్నికళలూ మీలో యమిడిపోయాయి. మీ తంబురకధ విని ముగ్దుడనయ్యాను. సర్వసమర్ధులు మీరని ఆకధ ఋజువు చేసింది. అంత శక్తిని, ఆసక్తిని గలిగించిన కధాగానం నా నలబై సంవత్సరాల అనుభవంలో తమది మాత్రమే. ప్రదర్శనలో, ప్రావీణ్య్హలోముంది. రచనలో రంజకత్వంవుంది. ఈరెండూ సమపాళ్ళలో రంగరించి పోసి సరస్వతీమాత మీలో తన రూపాన్ని చూసుకుంటుందని భావిస్తున్నాను.

-- నాటకళారాధక బుగ్గా పాపయ్యశాస్త్రి

ఏక్టర్ రేడ్డికి - డాక్టరేట్

ఏక్టరు పడాల రామకృష్ణారెడ్డి మహాశయులకు డాక్టరేటు రావడం అస్మదాదులకు ఆనణ్దదాయకమైన విష;యం. పదవిలోఉంటూ, పలు సాంస్కృతికకార్యక్రమాల్లో పాల్గోంటూ సాహితీక్షేత్రంలో కృషీవలునివలె లేఖినిపట్టి సహితీసౌరభాన్ని సృస్టించడమేగాక ప్రజల ఆదరాభిమానాల పాతృడైన ఉత్తమనటుడు రామకృష్ణారెడ్డి ధన్య్హజీవి. అధికారంలో ఉండి డాక్టరేటు పొందినవారు మనజిల్లాలో వీరే ప్రధములని నా భావన.

--ఆంధ్ర నయాగరా, ప్రొఫెసర్ భి. వి.యుస్. పాత్రుడు