పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/189

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జోరులో జొన్నాడ దాటి, బారులో బందరూ దాటి
జాలీలో ఓజాలి బెల్లా - జాలీబాంబేలా“ అనేపాట -

“హెలెస్సో యవ్వారి యవ్వా
లాగరోరీ లంగరు తాడు
పీకరోరి పిల్లారి జుత్తు
అన్నలారా, తమ్ములారా
లాగరోరీ లంగరు తాడు
మూడునెలలా ముండా పోరు
ఆరు నెలలా జన్మా ఖైదూ
ఎక్కరానీ పడవా మీదా
సెప్పరానీ దు:ఖా మొచ్చే“ అనే పడలాగే వారి పాట-
“ఏరు దాటించరో జాలారయ్యో
ఏరుమీద ఏరొచ్చే “
వడ్డాణం వలిచిస్తా. “
కడియాలు తీసిస్తా “
మళ్ళీ నేనొచ్చునపుడు “
మంచిగ నామనసిస్తా “ అనే శృంగారపు పాట

ఏలెయాల ఏలెయాల హైలెస్సో - ఓహో ....
దానీ ముగుడు ధర్మరాజయా” అనే పాట “

“కాంతమ్మో కారెల్లి పోతుంది
కస్ంతమ్మ కడియాలు - కారుమీదున్నాయి
కాంతమ్మ చీరలు. “
కాంతమ్మ వస్తువులు “
కాంతమ్మ చూపులు “
కాంతమ్మ పట్టాలు “
కాంతమ్మ ప్రాణాలు. “
కాంతమ్మో కారెల్లిపోతోంది “. అనేపాట
“నేలను నమ్మీ ఏలేలో-
చెట్టూ ఉన్నది- - - హైలెస్సో