పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

మీది ప్రగాఢమైన లోతైన సాంస్కృతిక దృష్టిగల రచన, అందునా జానపదకళలను శాస్త్రీయస్థాయికెత్తివాటికి పండితలోకంలో ప్రామాణీకత సాధించడానికి మీగ్రంధం ఎంతైనాఉపకరిస్తుంది.

విషయంచెప్పేతీరు పండిత పామరులందరికీ హృదయంగమంగా ఉండుట మీరచనలోని మొరొకవిశేషం. మీది ప్రతిభా పాండిత్య పరిశీలనలు ముప్పిరిగొన్న సాహిత్య వ్యాసాంగం , మీకు నా హార్ధిక శుభాకాంక్షలు.

డా.వి.యల్.నరసింహారావు ఎం.ఏ.పి.హెచ్.డి.

డైరక్టరు, ఆం.ప్ర. ప్రభుత్వప్రాచ్యలిఖిత గ్రంధాలయం. హైదరాబాదు

రామకృష్ణారెడ్దిగారి పరిశీలనగ్రంధం అనర్ఘరత్నం

శ్రీ రెడ్డిగారు జానపద కళలగూర్చి, వాని స్వరూప స్వభావాలగూర్చి, వానిహీనస్థితిగూర్చి పరిశోధనాత్మకంగా తేటతెల్లంగా యీ గ్రంధంలో ప్రకటించారు. తెలుగునాటక వికాసం గురించి, పౌరాణిక నాటకాల దుర్గతి, దుస్థితి గురించి నిరూపించి తమ బాధను వ్యక్తంచేశారు. అంతేగాక వివిధ శీర్షికలలో వాదు వివరించిన అంశాలు అద్భుతాలు, సహజదర్పణాలు.

శ్రీ రేడ్డిగారి పరిశోధనాసమగ్రతకు, విషయవివేచనకు యీ గ్రంధం అనర్ఘతరత్నం అనడంలో సందేహంలేదు. ఇట్టి రచనలు మరింతగా రచయితలేఖినిద్వారావెలువడాలని ఆశించడంలో అత్యాసలేదు.

ప్రొఫెసర్, డా.యం.ఆర్, అప్పారావు నూజివీడు అధ్యక్షులు ఆంధ్రనాటక కళాపరిషత్