పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

దంపూరు నరసయ్య

1898 దినచర్యలో కొన్నిపుటలు మాత్రమే ఇప్పుడు లభిస్తున్నాయి. నెల్లూరు నవాబుపేటలో బడి నడుపుతున్న రామయ్య “మంచి తెలివితేటలున్న వ్యక్తి” అని ప్రశంసిస్తూ, ఎనిమిదిమంది విద్యార్థులకు చదువు చెప్పినందుకు అతనికి గోశాల్ రామానుజులునాయుడు నిధినుంచి ఆర్థికసహాయం ఇప్పించడానికి నిశ్చయించుకొన్నట్లు ఈ దినచర్యలో పేర్కొన్నాడు.1

1900 ఆరంభం అయ్యేసరికి, నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ అచ్చాఫీసు నెల్లూరు నవాబు పేటలో ఏర్పాటుచేశాడు. ప్రెస్సు ఉన్న ఇంట్లోనే కాపురం ఉంటూ పత్రిక నడిపాడు. నరసయ్య 1901 అక్టోబరులో నెల్లూరు కోర్టులో ఇచ్చిన వాజ్మూలంలో "My profession - press office and cultivation" అని, "My residence - Nellore village" అని చెప్పాడు. పత్రికవల్ల కర్చుతప్ప, రాబడిలేని పరిస్థితిలో పత్రికా నిర్వహణ తనవృత్తి అని చెప్పుకోడంవల్ల ఆ వృత్తిమీద ఆయనకున్న గౌరవభావం, అభిమానం వ్యక్తమవుతున్నాయి.

1905, 1906 దినచర్యలు

ఈ దినచర్యలు 12cm x 8cm సైజు చిన్న పుస్తకాలు. వారం మొదలైన వివరాలుదిద్ది, నరసయ్య 1904 డైరీలో 1905 దినచర్య, 1905 డైరీలో 1906 దినచర్య రాశాడు. గత సంవత్సరం డైరీలో కొత్త సంవత్సరం దినచర్య రాయడమే ఆయన దయనీయస్థితిని సూచిస్తుంది. ఇంత చిన్న సైజు పుస్తకాల్లో గంట గంటకు జరిగిన విషయాలు పేర్కొంటూ, కొన్ని పుటలు పెన్సిల్ తో, కొన్ని పుటలు ఇంక్ పెన్‌తో, కరక్కాయసిరా కలంతో రాశాడు. పేజీకి ఒకవైపు రాసిన సిరా ఊరి అవతలివైపు పుటలోని రాతతో కలగలసి పోయింది. ఇరికించి సన్న అక్షరాలు రాయడంవల్ల ఆయన దస్తూరి పోల్చుకోడం పూర్తిగా సాధ్యపడలేదు. ఈ దినచర్యల వల్ల ఆయన చదివిన పుస్తకాల పేర్లు, పత్రికల పేర్లు కొన్నైనా తెలుసుకోడానికి వీలుపడింది. ఆయన విశ్వాసాలు, ఆచరణ, ఇతర వివరాలు గ్రహించడానికి అవకాశం కలిగింది.

పందొమ్మిది వందలా ఐదుకల్లా నరసయ్య తన నివాసం నెల్లూరు నుంచి భట్టారంవారికండ్రిగకు మార్చి, అక్కడ తన అక్క మీనాక్షమ్మతో ఉంటూ వ్యవసాయం సాగించినట్లుంది. 1905 దినచర్య ఈ విధంగా ఆరంభమవుతుంది. “శ్రీరామ

"శ్రీరామ - శుభమస్తు”

Sunday 1st January 1905

Bhattaramvari Khandriga,

Codoor V., N.T., N. Dt.

Morning : Begin another year, with many fears, misgivings and prayers to my Almighty heavenly Father, may the Lord give us our daily bread and shield us from all evil throughout the year..."