పుట:Dvipada-basavapuraanamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

బసవపురాణము

బాలేందు శేఖరుపనుపునఁజేసి
వచ్చిన నందికేశ్వరుఁ డాత్మలోన
నచ్చెరువంది తా నరుదెంచుపనికి
ననుగుణంబుగఁ దన్నుఁ దనయునిఁ గాఁగ
వనజాక్షి నోమె నే మని చెప్పవచ్చుఁ ! 640
దలఁచినకార్యంబు దలకూడె ! ననుచు
వెలఁదిగర్భమునఁ బ్రవేశింపఁ దడవ
మగువ కంతట నెల మసలెఁ దోడ్తోన
తగ గర్భచిహ్నముల్ దా నంకురించె ;
నమృతాంశుఁ డగుపుత్త్రుఁ డతివగర్భమున
నమరి యుండుట నొక్కొ యాఁకలిగాదు ;
జలజాక్షికడుపున సద్భక్తిరుచికుఁ
డలరుటనో రుచు లరుచు లై తోఁచె;
బాండురాంగునిమూర్తి పడఁతిగర్భమున
నుండుటనో [1] వెలరొందె మైదీఁగ : 650
పడతి శీలపుఁజూలు భవిపాకములకు
నొడఁబడ కునికినో యోకిళ్లు వుట్టెఁ :
గ్రాలుచు సుతునిరాకకు నోరు దెఱచు
లీలనో సతి కావులింతలు వుట్టె :
శివమూర్తి దనకు లోనవుటనో తవిలె
శివయోగనిద్ర నాఁ జెలువకు నిద్ర;
కాలకంధరుమూర్తి గడుపున నునికి
నో లలితాంగి చన్మొనలు నల్పెక్కెఁ ;
బెనుపుగ శివమూర్తి వనితగర్భమునఁ
దనరనో నడుము పేదఱిమి వోనాడె; 660
యోగీంద్రహంసుఁ డయ్యువిదగర్భమున
రాగిల్లుటనొ నడ వేగంబు వదలె :

  1. వెల్లనయ్యె