పుట:Dvipada-basavapuraanamu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

163

పరఁగంగఁ గిన్నరబ్రహ్మయ్య నాఁగ
ధరణిఁ బేరిచ్చి నిత్యముఁ బడిగాఁగ
నొక్కమాడయురూకయునుబాతికయును
మక్కువఁ గరుణింప మహి నరు ల్వొగడఁ
జేకొని జంగమానీకంబునకు స
దాకాలముజను నర్పితము సేయుచుండ, 30

—: కిన్నరబ్రహ్మయ్య బసవనియొద్దకుఁ బోవుట :—


బసవనియసమ సద్భక్తిసౌరభము
వసుధపై వెల్లివిరిసి దెస ల్గప్ప
రాగిల్లి కిన్నరబ్రహ్మయ్య సనియె
వేగంబె బసవని వీక్షించువేడ్క ;
బసవఁడు గిన్నరబ్రహ్మయ్య రాక
యెసకంబుతో సంగమేశ్వరునంద
కని యెదురేఁగి చక్కన చాఁగి మ్రొక్కి
యనునయోచితసత్క్రియాదులఁ దనిపెఁ :
గరమొగ్గి పాదోదక ప్రసాదములు
నిరతిశయప్రీతి నిత్యంబుఁ గొనుచు 40
సవిశేషత త్త్వానుభవభవ్యగోష్ఠిఁ
దవులుచు బసవఁ డుత్సవలీల నిండ
నంత వినోదార్థమై యొక్క నాఁడు
సంతోషచిత్తుఁ డై చని కిన్నరయ్య
యాపురంబునఁ ద్రిపురాంతక దేవు
గోపురాంతరమునఁ గూర్చున్న యెడను..

—: గొఱియ కథ :—


వారాంగనార్థ మై వధియింప విలిచి
కోరి మిండం డొకగొఱియఁ జేపట్టి
యవ్వీథిఁ జనఁ జనఁ ద్రివ్వంగఁ ద్రాడు
ద్రెవ్వుడు గొఱియ దద్దేవాలయంబు 50