పుట:Dvipada-basavapuraanamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

బసవపురాణము

బురికొల్పి మీఁదఁ గపోతముల్ దీర్చి 910
కరువుఁ బ్రతిష్ఠించి గంటయు వేది
విరచించి శిఖరంబుఁ గర మొప్ప నిలిపి
ద్వారబంధంబులు దగిన వాకిళ్లు
నారంగ గర్భగృహాదులు దీర్చి
యకలంక కరవీరముకుళ ప్రభాతి
ప్రకటించి దేహళీబంధంబునందు
రమణీయ పూజాప్రబంధానేకరచన
గావించి, చెలఁది ద్రికాలంబు భక్తి
భావనమై శివుఁ బాయక కొలువ- 920
హరుమీఁదఁ జెలఁది మున్నల్లిన సూలు
గరి యంత నేతెంచి కాంచి కోపించి
పాయక శివుమీఁదఁ [1]బాదొట్రు వెట్టి
పోయెడు నిది యేమి వురువొకో' యనుచు
ఘనకర్ణచలిత సంగత మారుతమునఁ
బొనరిన పాదొట్రుఁబోవంగఁ ద్రోచి,
వెండి తాఁ దెచ్చిన తుండాంతరమున
నిండారుమొగలేటి నిర్మలాంబువుల
నంబికాధవునకు నభిషేకమార్చి,
యింబులఁ గుంభస్థలంబుపైఁ బెట్టి, 930
తెచ్చినకలువల నచ్చఁ దామరల
నిచ్చలుఁ బూన్చుచు నిటలలోచనునిఁ
గరియును నిట్లు ద్రికాలంబు గొలువ..
నరుదెంచి చెలఁది దా నాగ్రహం బంది
'కమనీయలీల నా కట్టినగుడియు
నమరుమదీయ నిత్యార్చనావలియు
నెట్టికర్మియొ చెర్చి యేఁగెడు నింక
నిట్టి శివ ద్రోహ మెట్టు సై రింతు ”

  1. సాలెగూడు.