పుట:Devi-Bhaghavathamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



శ్రీమత్పరదేవతాయైనమః

శ్రీ

దేవీ భాగవతము.

తృతీయస్కంధము

శ్రీ కర కడియెద్ద శుభా
ఖ్యాక గ్రామాభిజనన! హరనీహార
శ్రీకలిత దివ్యకీర్తీ!
ప్రాకటగుణ చక్రవర్తి! బ్రహ్మయశాస్త్రీ.

వ. అవధరింపు మక్కథకుండు మునుల కిట్లను నట్లు భాగవత కథనాభి ముఖుండగు సాత్యవ తేయునకు జన మేజయుం డిట్లనియె. 2

గీ. వ్యాస! సత్యవతీసుత! భగవతీమ
ఖంబనుచుఁ జెప్పితివి తద్భగవతి యెట్టి
దో యెవరొ యెట్టి గుణములతో నెసంగు
నో తదీయ మఖం బెట్టిదో వచింపు. 3

207