పుట:Devi-Bhaghavathamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీమత్పరదేవతాయైనమ:

శ్రీ

దేవీ భాగవతము

———:x:———

ద్వితీయ స్కంధము.

————

- -

శ్రీ చర్ల కులాంబుధి రా
కాచంద్ర! సమస్తయాచకసురద్రుమ! ధీ
వాచస్పతి! దుర్మత దు
ర్వాచాదుర్వల్లిశస్త్రీ! బ్రహ్మయశాస్త్రీ! 1

గీ. అవధరింపు మనంతరం బఖిలమునులు
సూతుఁ గన్గొని హర్షసమేతులగుచు
" సత్యవతి నెట్లు కై కొనె శంతనుండు
మున్నె యామెకు వ్యాసుడు పుట్టుటెట్లు? 2

వ. వ్యాసుని జన్మంబును సత్యవతి యాధార్థ్యమ్మును సవిస్తరముగా
నెఱిగింపు " మనవుడు సూతుడు, 3

ఉ. అంబ! నినుం దలంచు జనులందఱు ధర్మము నర్థకామమో
క్షంబులు గాంతు రీవకద సర్వనియంత్రివి నీదు మంత్రరా
జంబు పఠించువారలకు శాశ్వతసిద్ది ఘటించు మత్ర్రణా
ముంబును సేకరించి నను మాన్యవచోవిభవుం బొనర్పుమా. 4

17. 129