పుట:Delhi-Darbaru.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థానేశ్వర యు

7


పాంచాల దేశము మహమ్మదుగోరి స్వాధీనమై యుండెను. బిటుండా వఱకును నతని పటాలములు వ్యాపించి యుండెను. పృథ్వీరాజ నేకులగు నాయకుల సమకూర్చుకొని గొప్ప సైన్యముతో నాపట్టణము పైకి వెడలెను. మహమ్మదుగోరి యితని నెది ర్చెను. స్థానేశ్వరము నకును గర్నాలునకును మధ్య ప్రదేశమున నిప్పుడు ' తిరౌరి ' యనఁబడు నారాయణ్ ఒద్ద ఘోర యుద్ధము జరిగెను. పృథ్వీరాజు గోరీ పై కురికి కుడిభుజమున ఖడ్గముఁ జొప్పించెను. 'ఇతని భటుఁడొక్కం డీతనినిం దక్షణమే మోసికొని పోవకున్న నా దెబ్బతోడ నె యితఁడు చచ్చినవాఁడె" యని 'ఫెరిస్తా లిఖించి యున్నాడు. మహమ్మదీయ సైన్యము చెల్లా చెదరయి పోయెను. పృధ్వీ రాజు సంపూర్ణ విజయమందెను. హిందూ చరిత్రకారులు గోరీ యీ విధమున నేడుసారు లోడిపోయి యేడుసారులు వదలి పెట్ట బడెనని వ్రాయుచున్నారు. ఇది ఎట్లున్నను గోరీ గొప్ప పరా భవ మందెననుట మాత్రము నిజము. పృధ్వీ రాజునకు వైరులగు జయచంద్రుఁడాదిగాగల ననేకావనీశులు మొదటి నుండియు గోరీకి సాయ మొనర్చిరి. కాని వారికి క్రీ! శ. 1198 వఱకును మనోభీష్ట మీడేర లేదు. ఆ సంవత్సరమున గోరీ 1,20,000 సైన్యమును జేర్చుకొని పృధివీరాజుకు “నీవు మహమ్మదీయుఁ డైనను గమ్ము. లేకున్న సమర మొసంగు”మని వార్తఁబం పెను. ,