పుట:Delhi-Darbaru.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

ఢిల్లీ నగర చరిత్రము.

నోడింపఁబడిరి. నాఁటినుండి చౌహణ్ రాజులు ఢిల్లీకి నాధు లయిరి. వీసల దేవుని మనుమఁడే లోక ప్రసిద్ధిగనిన పృధ్వీ రాజు. ఇతఁడు అజిమీరు ఢిల్లీల రెంటికిని రాజయి. ఢిల్లీయందు “లాల్కోట'యును, దానికి బల మొసఁగ, మఱియొక కోటయును గట్టిం చెను. కొంతకాల మీకొత్తగ నేర్పడిన పట్టణమునకుఁ బృధ్వీ నగరమని పేరుం డెడిది. నేటికీని కుతుబ్ మినారు చుట్టు పట్ల నీతనిచేఁ గట్టఁబడిన దుర్గపు శిథిల కుడ్యములు చూపట్టు చున్న వి. ఇతఁడు కనూజ్ రాజును తనకు విరోధియు నగు జయ చంద్రుని పుత్రిక యగు సంయుక్తను గాంధర్వ వివాహమున క్రీ శ. 1175 – సంవత్సరమునఁగొని తరువాత మామగారితో ప్రచండముగఁ బోరి భార్య శౌర్యము వలన జయమందెను.[1]

1182-సం|| మున నితఁడు చందేరాజును జయించెను. కాని యీతని యశస్సునకు హేతువు లివి యెవ్వయుఁ గావు. భరతవర్షము నాక్రమింపఁ బ్రారంభించి దాడి వెడలి బయలు దేరి నచ్చిన మహమ్మదీయ సైన్యమహా సముద్రమున కడ్డకట్టగా నిలిచి, ధైర్య ఫైర్య పరాక్రమములతో, బోరుటయె యీతని కజరామర కీర్తిని సంపాదించి పెట్టినది.


  1. (మహమ్మదీయ మహాయుగమున నీ విషయమంతయుఁ జక్కగ వర్ణింపఁబడియున్నది. విస్తరభీతిచే నిట విరమించితిమి).