పుట:Delhi-Darbaru.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

హైదరాబాదు సంస్థానము.


కాలముగ జీతము అప్పుపడుచునే వచ్చియుండెను. స్థానిక వణిక్కులకు నైజాము ప్రభుత్వము వారు బాకీయైన మొ త్తము మిక్కిలి గొప్పదిగనుండెను. మన్ సబ్ దారులకును జీతముబత్తె. ములనిచ్చుటకు పన్ను లువచ్చు మార్గములు విశేషము గన్పించి నవి కావు. చిల్లర సైన్యముల ప్రతినిధులగు ఆరబ్బీ జమేదారు లును సాహుకారులును అప్పటి కాలమునకు హైదరాబాదు నందు ప్రముఖులుగ నుండిరి. పన్ను లును బలములును జమే దారుల చేతులలోను వైజాము రాజ్య నిర్వహణమునకు ముఖ్య మగు నార్థికశక్తి సాహుకారుల చేతులలోను జిక్కి యుండెను.

ఆర్థిక సంస్కారములు.

సాలార్ జంగ్ తనసత్యసంధత చేతను కార్యదీక్ష చేతను జమేదారులను,సాహు కారులను ముందు లోబరచు కొనెను. ఆధికారమునకు నచ్చిన కొన్ని నాళ్లలోపుగ నె నైజాముగారి బంధువులకును చిల్లర సేనలకును సేవకులకును నెలజీతముల నిచ్చుటయు, తాలూకుదారులను నియోగించు టయుఁ దొలఁగించుటయు, లెక్కలను బరీక్షించుటయు, వేతన ములను దగ్గించుటయు, అవసరమగునెడల క్రొ త్తగ దండుల నేమించుటయు, మున్నగు కార్యములు చేయుటకు స్వాతం త్ర్యమును ఇతఁడు నైజామునుండి సంపాదించుకొనెను. అవిధే యత సూపినచో సర్కారు వారికి అనఁగా నైజాము “నకు చేరిన దివానీశాఖ లోని వారినిగాని సైనికశాఖలోని