పుట:Delhi-Darbaru.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

హైదరాబాదుసంస్థానము.



కును గొంచీగా అనుభవమున కిచ్చెదనని యుపక్రమించెను. అదియు కుదిరినది కాదు. తుట్టతుదకు 1858వ సంవత్సరమున కొద్దిమార్పులతో రెసిడెంటు'లో' మొదటఁ దెచ్చి యిచ్చిన చిత్తు ననుసరించియే సందిజరి గెను.

తీర్మానపుసంధి (1838).

ఈసంధివలన నైజాము సైన్యము సంపూర్ణముగ నాంగ్లే యుల యధీనము క్రింది కే పోయెను. దానికి ' హైదరాబాదు కంటింజెంటు సైన్యము' అను పేరిడఁబడెను. దానికగు వ్యయమున కయ్యును, అప్పుపై వడ్డి కొఱకును, కొన్ని ఇతర కర్చులకును నైజాము ఆంగ్లేయ ప్రభుత్వము వారికి బీరారు మున్నగు ప్రదేశములను సర్వస్వతంత్రములతోఁ బరిపాలింప నిచ్చెను. కాని వారుమాత్రము ప్రతి సంవత్సరమును అతనికి దానిని గుఱించి న్యాయమగు లెక్కలనుజూపి కర్చులు పోఁగా మిగత పైకమును అతని బొక్క సములోనికిఁ గట్టునట్లే ర్పటుపఁ బడెను. 1800 సంవత్సరపు సంధిననుసరించి నైజాము ఆంగ్లే యుల సాహాయ్యర్థమయి యుద్ధ సమయములఁ గొంత సైన్య మును బంపవలసి యుండెనుగదా!! హైదరాబాదు కంటింజెంటు సైన్యము" ఏర్పడి ఎల్లప్పుడును సిద్ధముగ నుండునట్లు స్థిరపడి నందున ఈషరత్తు రద్దుచేయఁ బడెను.