అష్టమాశ్వాసము
141
క. | దనుజేంద్రుఁడు ఖడ్గము గొని, వనచారులమస్తకములు వడినేయుచు నొ | 122 |
వ. | తత్క్షణం బక్షోహిణీక్షోభకందళితామర్షుండును నతిపరుషవిశిఖదలితధ్వజుండును నర్ధచంద్రనికృత్తధనుషుండును, నస్త్రధారావిదారితసారథియు నతివిస్మయనీయకరలాఘవుండు నగు నారాఘవానుజు నమర్షవేగముక్తం బైనశక్తిచే యాతుధానుండు ముహూర్తమాత్రం బుపరాగంబున నిశాకరునింబలె మూర్ఛానిమీలితుం జేసిన. | 123 |
గీ. | రాముఁ డంతట శక్తినిర్దళితహృదయు, ననుజుఁ గనుఁగొని శోకవిద్ధాత్ముఁ డగుచుఁ | 124 |
చ. | వలయితచిత్రచాపుఁడును వారితపంక్తిముఖుం డతిక్రుధా | 125 |
వ. | అప్పు డాంజనేయపురానీతమహీధరమహౌషధిసమేధితజీవితానుజాశ్లేషసుఖలబ్ధమనోరథుండును బ్రవర్ధమానసమరకౌతుకోఫలంభుండును సంరంభోదంచితపులకకంచుకితగాత్రుండును నగుదాశరథి యుద్ధమధ్యంబునందుఁ బురందరానుగ్రహంబుచే మాతలిసమానీతం బైనరథంబును విశంకటం బగుకంకటంబును బరిగ్రహించె. | 126 |
పంచపాది. | సరిజో డబ్బె నటంచుఁ జూపుదురు దోశ్శౌండీర్య మన్యోన్యమున్ | 127 |
వ. | అనంతరం బవిశ్రాంతవిముక్తదివ్యాస్త్రులును నాఖండలవృత్రసన్నిభులును నగునయ్యిరువురకును విచ్ఛిన్నంబు లగుమార్గణంబులును విలూనంబు లగుధనుర్గుణంబులును వినిహతంబు లగుదురీణంబులును నిర్భిన్నంబు లగుసాంయోగికరథంబులునుం గలుగునట్లుగా నిర్వైకల్యవిజయమనోరథంబు నిరతిశయవిశదయశోధనంబు నగునాయోధనం బయ్యె. | 128 |