అష్టమాశ్వాసము
139
| మేదినీసుతావృత్తాంతుఁడై రామభూమీకాంతుండు వజ్రనిర్ఘోషంబున మానసచరం బగు రాజహంసముంబలె విదీర్ఘమానసుండై నేల వ్రాలి సౌమిత్రిచేత నాశ్వాస్యమానుం డగుచు సకరుణంబుగా బిట్టునిట్టూర్పు నిగిడించుచు విలపింపం దొడంగె. | 107 |
చ. | అరణినిఁ గీలలీల జనకాధ్వరవాటమునందుఁ బొందుగా | 108 |
క. | పవనజుయత్నము వృథ నలు, నవసేతుక్రియ యథావినాశిని విశిఖం | 109 |
ఉ. | మానుగ నెందునేని బవమానతనూజునిపూన్కి వ్యర్థ మెం | 110 |
వ. | ఇత్తెఱంగున విలపించురామునిం గనుంగొని విదితాసురమాయావిశేషుం డగువిభీషణుండు దేవా నీవంటిమహానుభావునకు నస్థానంబున దీనం బగునవస్థాంతరం బేటికి నిరంతరాయమఖనిర్వర్తనార్థంబుగాఁ బురందరారి యొనరించిన కపటకృత్యం బిది, సత్యంబు గా దని తద్వధంబునకు లక్ష్మణుం బురస్కరించికొని నికుంభిలోపరోధంబు గావించిన. | 111 |
చ. | హరిపరివారఘోరనినదారభటిం జలితాంతరంగుఁ డై | 112 |
క. | ఆవానరసేనకు ఝం, ఝాపాతూలంబు తూలచయమునకుబలెన్ | 113 |
వ. | ఇట్లనుపదంబును ననీకోన్మథనసంరబ్ధసంవర్తవర్తియగు సమవర్తిచందంబున నమందస్యందనారూఢుం డై వచ్చుసంక్రందనపరిపంథిం గనీ గంధవహనందనస్కంధవర్తి యై సౌమిత్రి ప్రవర్తితనిశితశరధారుం డై శతధారపాణి జంభాసురునింబలె స్తంభితుం జేసిన. | 114 |