అష్టమాశ్వాసము
137
క. | తరుచరనిశిచరవరులకు, దురము సరోషహతశిరము దుష్కరము మరు | 93 |
గీ. | తరుచరాంతకుఁ డగునరాంతకుని దునిమె | 94 |
వ. | వెండియు నసమసమరశీలుం డగునీలునిచే మహోదరుండును, మరున్నందనుచేఁ ద్రిశిరుండును, మహాపార్శ్వావాహినీపతులునుం దెగుటయు విషాదరోషపరవశుం డై నిశాచరాకారం బగునంధకారనికాయంబునుంబలె నతికాయుండు సుమిత్రాపుత్రునిం గినిసి వృత్రాసురుండు సుత్రామునితో బలెఁ జిత్రాహవం బొనరించె. | 95 |
గీ. | అతఁడును భుజాభుజిఁ బెనంగి యితఁ డవధ్యుఁ | 96 |
వ. | అంత. | 97 |
ఇంద్రజిత్తు రెండవయుద్ధము
గీ. | విధురుఁ డగుతండ్రి నూరార్చి పృథురణధుర | 98 |
వ. | వచ్చి సమరంబున నరాతిజయమనోరథంబుకొఱకు రథరక్షార్థంబుగా, రాక్షసుల నలుగడల నుండ నియమించి ప్రదక్షిణశిఖుం డగుశిఖావంతుని హవిరర్పణంబున సంతర్పితుంజేసి మంత్రాధిగమవిచిత్రంబు లగునస్త్రంబులు ధరియించి తిరోహితుండై నిశితముఖంబు లగుశిలీముఖంబుల నిఖలమర్మాహతినిర్మాణాలంకర్మీణుండై క్రవ్యాదుండు వ్యాధుండునుంబలె హరుల విధురులం గావించి. | 99 |
క. | అకుటిలు రాము సలక్ష్మణు, వికలాశయు విధురసత్త్వు విరచించె నితాం | 100 |