పుట:Chandamama 1947 07.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెచ్చి యిచ్చింది ! పాప, అద్దంలో నా బొమ్మ
చూసి నేను వచ్చానని ఏడుపు మా వాడు !
చూశారూ శ్రీ రాముడు ఎంత అమాయకుడో !

అయితే నేను మీ ముత్తాతల, తాతల, తండ్రుల
కాలంలో రాలేక పోయాను. కాని ఇప్పుడు
వస్తున్నాను. మీకూ, మీ చెల్లెళ్ళకూ, అక్కలకూ,
అన్నలకూ, తమ్ముళ్ళకూ కనిపిస్తాను. క్రింద
భూలోకంలో, పైన ఆకాశంలో నేను చూసిన
వింతలు, విడ్డూరాలు అన్నీ చెప్పుతాను. నాకు
తెలిసిన కథలు, శాస్త్రాలు, పాటలు, పదాలు,
గమ్మత్తులు, అన్నీ మీకు వినిపిస్తాను. ఇదుగో
ఇప్పుడు కొన్ని చెప్పుతున్నాను. ఇప్పటి కివి
చాలుకదూ ? చాలలకపోతే నాకు చెప్పండి. వచ్చే
నెల వాటి అన్నిటితో మీ దగ్గరికి వస్తాను.

మీ
చందమామ.