పుట:Chandamama 1947 07.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తెలుగు పిల్లల్లారా!

మీకు ఊహ వచ్చినప్పటినుంచీ నన్ను మీ చిట్టి చిట్టి చేతులతో ' చందమామ రావే, జాబిల్లి రావే ', అని పిలుస్తూ ఉండేవాళ్లు. మీరే కాదు; మీలాగా మీ అమ్మ, మీ నాన్న, మీ అవ్వ, మీ తాత, మీ ముత్తవ, మీ ముత్తాత, ఆయన తండ్రి, ఆయన తాత, అందరూ నన్ను ' మామా ' అని పిలిచేవాళ్లు. నేను నవ్వేవాణ్ణి. నా నవ్వుచూస్తే మీకు ఎక్కడలేని సంతోషం. నన్ను తెచ్చిపెట్టమని అమ్మతో పోరు పెట్టేవాళ్లు! చూశారూ? మీరేకాదు, శ్రీరాముడు కూడా వెనక ఇలాగే పోరుపెట్టాడు. అప్పుడు వాళ్ల అమ్మ కౌసల్య ఏమి చేసిందనుకున్నారు? అద్దం