పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకండవ ప్రకరణము

దేశోపకారి


సుశీలుని వ్యాపారము సాగిన, నతని సుశీలము వన్నెకెక్కును. అట్టుసాగుటవలన నితనిమనస్సు కరగును, నమ్రతవహించు, సంతోషముగనుండును. కర్తృత్వమువలన వచ్చిన సొమ్ముకర్తకు మేలు చేయుననుట సందేహము. అసాధారణమైన ధర్మబుద్ధి, వివేకము కలిగియుండినగాని.కర్తశ్రేయస్సును పొందుట కష్టము. మానవశరీరము కనుక ధనము దీనికి మాంద్యము కలిగించును. అందుచేత ప్రజలకు వీ దుపకారియగుటకు వీలులేదు. ముందు వెనుక లాలోచించి, క్రమముగ వ్యాపారము సాగుటవలన లాభమును బొందువాడు, చాలకాల మనుభవించి, తుదకు స్వార్జితము నుసద్వినియోగముచేయును.

బెంజమిను దినదిన ప్రవర్థమానముగ వృద్ధిపొందుచు వచ్చెను. పరగణాలో నితని 'గెజెటు' వార్తాపత్రిక పేరుకెక్కి, ముఖ్య పత్రిక యయ్యెను. 'పూరురిచ్ఛర్డు' పత్రిక ప్రచురింపబడి, జనులకు సంతోషము కలుగ జేయుచుండెను. వీనివలన బెంజమినుకు లాభము వచ్చుచుండెను.