పుట:Balavyakaranamu018417mbp.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

31. ధాతుజ విశేషణ వ్యవధానంబున విశేషణంబు లన్నింటి కయి పదంబనుప్రయుక్తం బగు.

ఆద్యుఁడయి యప్రమేయుఁడై యఖిల సేవ్యుఁడై యెసంగెడు దేవుని నభినుతింతు. ఇచట మఱియుం ప్రయోగ వైచిత్ర్యంబు గలదది ప్రయోగంబుల నెఱుంగునది.

32. భావార్థకాది యోగంబునం గర్తకుం బ్రథమ యగు.

రాముఁడు వచ్చుట - రాముఁడు రాఁగా లక్ష్మణుఁడు గాంచె - రాముఁడు విల్లందినం ద్రిలోకంబు లాకులంబులగు - రాముఁడు పట్టిన ప్రతిన వారింపం దరంబుగాదు.

33. ప్రథమాంతంబు లగు యుష్మ దస్మ ద్విశేషణంబుల కేకత్వంబున

వు ను లు ను బహుత్వంబున రు ము లు నంతాగమంబులు ప్రాయికంబుగ నగు.

34. ఈ యాగమంబులు పరంబులగునపు డుత్వంబున కత్వం బగు.

నీవు ధన్యుఁడవు - నేను ధన్యుఁడను - మీరు ధన్యులరు - మేము ధన్యులము. ఇకారంబు మీఁది కు-ను-వు క్రియా విభక్తుల యుత్వంబున కిత్వంబగు నను సూత్రముచేత వు ను ల కిత్వంబగు. నీవు సుకృతివి - నేను సుకృతిని - ఆర్తి హరుఁడ వౌ నినుఁ గొల్తు నంబుజాక్ష