పుట:Balavyakaranamu018417mbp.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకీర్ణక పరిచ్ఛేదము.

1. పదాద్యంబులు ఋ ఌ వర్ణంబులు ర ల తుల్యంబులు.

అతఁడు ఋషి - ఇట సంధి లేదు. ఆ ఋషి - ఇట యడాగమము లేదు. వచ్చె ఋషి - వచ్చెన్‌ ఋషి - వచ్చెను ఋషి. ఇట ద్రుతమునకు లోప సంశ్లేష స్వత్వములు.

2. ఆచ్ఛికపదంబులం దుత్తమంబు లగు రు లు డు ల ముందఱి యేత్వంబునకు హ్రస్వంబు విభాష నగు.

నల్లేరు - నల్లెరు, పల్లేరు - పల్లెరు, పెన్నేరు - పెన్నెరు, మానేరు - మానెరు, ఆడేలు - ఆడెలు, కుందేలు - కుందెలు, తోఁడేలు - తోఁడెలు, నాఁగేలు - నాఁగెలు, నేరేడు - నేరెడు, మారేడు - మారెడు, పూరేడు - పూరెడు, తంగేడు - తంగెడు.

3. ఊ యే ల పయ్యెద తాయెతులం ద్రిక్క నామంబులందు యాకుం దాలవ్య వక్రయోగంబు లేదు.

స్పష్టము.

4. ఊయేల యూయాల ల చాఁపుల నొండొంటికిం గుఱుచ యొండె నగు.

ఉయేల - ఊయెల - ఊయేల - ఉయాల - ఊయల - ఊయాల. వక్ష్యమాణంబు యద్విత్వంబు. ఉయ్యేల - ఉయ్యెల - ఉయ్యాల - ఉయ్యల.