పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉపోద్ఘాతము


ప్రపంచచరిత్రమునం దెన్నియోరాజ్యములు పొడచూపినవి, ఎన్నియో యంతరించినది. తృష్ణాబద్ధులై ఎందరో రాజులు ప్రజలను పీడించి, ప్రజలచే చంపఁబడిరి. పరదేశములపై దాడులు వెడలి, యుద్ధభూములం దెందరో రాజులు హతులైరి. లేదా, విజయముఁబొంది. కొంతకాల మాపర రాజ్యముల ననుభవించిరి. కానీ, ఈ విజయమంతయు రక్తమయమై, దుఃఖకరమై, క్షణభంగురమై యుండెను. మహెన్నతదశల ననుభవించిన మహారాజ్యములన్నియు నేఁడు భూమిలో నెచ్చటనో యూరును పేరును లేక యడఁగియున్నవి. కొన్ని నామమాత్రావశిష్టము లయినవి. ఇట్టివిజయములును, ఇట్టి రాజ్యములును నెందుకుసు పనికి రాకపోయినవని ప్రపంచచరిత్రము సాత్యమిచ్చుచున్నది.

కానీ, ఇట్టివిజయముకంటె మేలైనదియు, శాశ్వతమైనదియు నగు విజయముగలదని తెలుపుటకు అనేకచక్రవర్తులు పాటుపడియున్నారు. ధర్మవిజయమే నిజమయిన విజయమనిసమ్మి, తమకుసత్యమనితోచినధర్మమును లోకమునందు వ్యాపింపఁ జేసి ప్రజల ఇహపర సౌఖ్యములకు తోడుపడిన మహాచక్రవర్తు లందందుగలరు. ఇట్టివారు హిందూదేశము నందేకాక పరదేశములందుసు నుండిరి. కాన్‌ష్టంటైనుచక్రవర్తి, మార్కసుఅరిలియను, ఆల్‌ఫ్రెడు, ఛార్లమేను, మొదటి ఒమారుఖలీవు, అక్బరు మొదలగు చక్రవర్తులుకొందరు ధర్మస్థాపనము కొరకును, ధర్మప్రచారము కొరకును, ప్రయత్నములు చేసినట్లు మనకు చరిత్రములవలన తెలియుచున్నది. కాని, ధర్మవిషయముస భారతవర్షమునందు రాజులుగాని, ప్రజలుగానీ శ్రద్ధతీసికొనినటు ఇతర దేశములందు కానరాదు, భారత