పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

అశోకుని ధర్మశాసనములు.


చెప్పుచున్నాఁడు. [16] ఈవిషయముసుగుర్తించియే నేను ధర్మ స్తంభ ముల నిలపితిని.ధర్మమహామాత్రులను నియమించితిని, ధర్మ శ్రావణ ములను వినిపించితిని. [17] దేవానాం ప్రియుఁడగు ప్రియదర్శి రా జిట్లు చెప్పుచున్నాడు. [18] మార్గములందు పశువులడును, మనుష్యులకును నీడగా నుండుటకు మఱ్ఱి చెట్లను వేయించితిని, మామిడితోటలను వే యించితిని. [19] ఎనిమిదిక్రోసుల కొకటి చొప్పున నూతులను త్ర వ్వించి, వానిలోనికి దిగుటకు మెట్లను కట్టించితిని. [20] పశువుల యొక్కయు, మనుష్యులయొక్కయు ఉపయోగమునిమిత్తము అనే పానశాలలను నిర్మించితిని.[21] కాని, ఈ ఉపయోగ మంత ముఖ్యమ యినది కాదు. [22] పూర్వరాజులచేతను, నాచేతనుగూడ లోకము అనేక సుఖములచే సుఖంవఁ జేయఁబడినది. [23] కాని, జనులుధర్మా నుప్రతిపత్తిగలిగి వర్తింతురనియే నేనీ కార్యములను చేసితిని. [24] దేవానాంప్రియుఁడగు ప్రియదర్శియిట్లు చెప్పుచున్నాఁడు. (25) సన్యాసులకును, గృహస్థులకును సుపయోగపడు ననేక వ్యవహారము లందును, సమ స్తశాఖల వారి వ్యవహారములందును, ఆ నాధర్మమహామా త్రులు వ్యాపృతులై యున్నారు. (26) సంఘముల వ్యవహారములందు వ్యాపృతులై యుండవలయునని కొందఱు మహామాత్రుల కాజ్ఞాపించి తిని, అట్లే మరికొందఱు బ్రాహ్మణుల యొక్కయు ఆజీవికులయొక్కయు వ్యవహారములను చూచుచుండవలయు ననియాజ్ఞాపించితిని. కొందఱు నిర్గం థులవ్యవహారములను చూడవలయునని యాజ్ఞాపించితిని. ఇతరులు ఇతర శాఖల వారివ్యవహారములను చూచుచుండవలెనని యాజ్ఞాపించితిని. ఈ రీతిగా వివిధ మహామాత్రులను వివిధ సంఘములవారివ్యవహారములనుచూ డనియోగించితిని. (27) కాని, నామహామాత్రులు తమకు నియమింపఁబ డిన సంఘముల వారియందేగాక ఇతర శాఖలజనులందును వ్యాపృతులై యున్నారు. (23) దేవీనాంప్రియుఁడగు ప్రియదర్శి రాజిట్లు చెప్పుచు న్నాఁడు .(29) వీరును నాముఖ్యామాత్యులలోన నేకులును నా దానములను