పుట:Andhrulacharitramu-part3.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రుల చరిత్రము

మూఁడవ భాగము


మొదటి ప్రకరణము.

ఆంధ్రదేశస్థితి.

(క్రీ.శ 1323 మొదలుకొని క్రీ.శ.1344 వఱకు.)

ఆంధ్రనగరమున జరిగిన ఘోరసంగ్రామములో నోరుగంటి ప్రతాపరుద్రుఁడు డిల్లీ చక్రవర్తిచే నోడింపబడి చెఱఁగొని పోఁబడుటయు, ఆంధ్రవీరనాయకులనేకులు డిల్లీచక్రవర్తితోడి యుద్ధమున వీరస్వర్గమును జూఱఁ గొనఁ బోవుటయు గాకతీయ సామ్రాజ్యము భగ్నమగుటకుఁ గారణము లయ్యెను. ఆంధ్ర సామ్రాజ్యలక్ష్మి డిల్లీ తురుష్కవీరుల క్రౌర్యమునకుఁ దాళఁ జాలక పరాభూత యై యాంధ్రనగరంబున నొక్కక్షణమైన నిలువ నొల్లక ప్రతాపరుద్రధనాగారరక్షకులగు హరిహర బుక్కరాజులతోడి చెలిమిం జేసి దిగువకర్ణా