పుట:Andhra Bhasha Charitramu Part-3.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర భాషా చరిత్రము.

పదునొకండవ ప్రకరణము.

నన్నయకుఁ బూర్వకాలపు భాష.

నన్నయకుఁ బూర్వ మేడవశతాబ్దమువఱకు నాంధ్రభాషాస్వరూపమెట్లుండెనో తెలిసికొనుట కాధారములు గానరావు. ద్రావిడ భాషలకేకాక భారతీయభాషల కన్నీటికి నది యఙ్ఞాతయుగ మనియే చెప్పవచ్చును. ఆ కాలమున వ్యావహారిక ప్రాకృతభాషలు మాత్రము ప్రచారమున నుండెనని మాత్రము చెప్పుటకవకాశమున్నది.

ఏడవ శతాబ్దము నుండియు శాసనములలోఁ గొన్ని గ్రామముల పేళ్లు కానవచ్చుచున్నవి. తక్కిన శాసనభాష యంతయు సంస్కృతముగనే యుండెను. కాని, రాను రాను తెనుఁగు భాగమెక్కువగాఁగల శాసనములును నెలువడఁ జొచ్చినవి. వానియందలి భాష నన్నయకాలపు భాషకుఁ గొంత విలక్షణముగ నుండును. ఆయా శాసనముల కాలమున వ్యవహారమందలి భాష యట్లే యుండి యుండవచ్చును. అట్టి శాసనములు నేఁటివఱకు బయల్పడిన వీ క్రింద కొంత వివరణముతోఁ బొందుపఱుపఁబడినవి.

జయసింహావల్లభుని శాసనము. (క్రీ.శ . 633.)

జయసింహావల్లభుఁడు కుబ్జవిష్ణువర్ధనుని పుత్త్రుఁడు. తెలుఁగున నున్న శాసనములలో నెల్ల నిదియే ప్రాచీనతమమైనదని యెన్నఁబడుచున్నది. ౧. స్వస్తి శ్రీమత్ సకలలోకాశ్రయ జయసింఘ ౨. వల్లభ మహారాజులాకున్ ప్రవర్ధమానవిజయరా ౩. జ్య సంవత్సరంబుళ్ ఎణుంబొది అన్నేణ్టి అమ్మ౯పూణ్ణ ౪. మ నాణ్డుం మ్లావిండిరాజులముట్లు కలివిముదిరాజుల్ ౫. మ్లావిండి సముద్రరకై నాకుబణి సేసిన కల్చివీ ౬. ೞరుఱ్ల మద్దికదు మూటికి విత్పఱ్తి ఉత్తరంబున పులో ౭. ంబున చెఱువు పడుమాఱికోటన్ ఎణుంబొదిపు(వు?)ట్ళు ఆ ౮. ఱ్లపట్టు నేను[*] తూప్పు౯న కోటితా(ೞ)తోంటళాయు పడువా ౯. రంబు ఇచ్చిరి పాఱపడువారంబు మ్లావి (ం) డీశ్శ్వరంబున కళా