పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారాబాయి.

189

డయి రాజుపేరిట తానే రాజ్యము నేల యత్నించెను. ఇందువలనఁ దారాబాయికిని పేష్వాకును ప్రబలవైరము సంభవించెను. అందుపై తారాబాయి సింహ గడయందుండిన తన పతియొక్క సమాధిని దర్శించు మిషతో నచటి కరిగి యచటి యామాత్యుని సహాయమువలన రాజ్యమును తానేల యత్నించెను. అప్పు డాసంగతి నెఱిఁగి బాలాజీ పేష్వా వైరముచే నీమే చిక్కదని తలఁచి మంచిమాటలచే నామెను పూనాకుఁ దీసికొనిపోయి రాజ్యమునందలి యనేకసంగతులు నీ యాజ్ఞప్రకారమే చేసెదనని చెప్పి యామెను సమాధాన పఱచుకొని రాజు నా యాజ్ఞప్రకారము నడువ వలయునని చెప్పెను.

ఈ సమయమునందు రామరాజు (తారాబాయి మనుమనిపేరు) సాగోళేయను గ్రామమునందుండెను. రామరాజునకు రాజ్యవ్యవస్థ తెలియనందువలన తనకుఁ గొంత జహగిరి వదలి రాజ్యమునంతను పేష్వాను చేయుమని యతఁడు వ్రాసి పంపెను. ఆప్రకారమే పేష్వా రాజయ్యెనుగాని యతనికి జహగిరి యియ్యకుండెను. తదనంతరము రామరాజును కొంత సైన్యముతోడ సాతారకంపెను. అచట నతనికిఁ బట్టణమంతయుఁ దిరుగుట కనుజ్ఞమాత్ర మిచ్చెను. అటుపిమ్మట పేష్వా ఔరంగబాదునకుఁ బోవుట తటస్థమయ్యెను. ఆసమయమునఁ దారాబాయి రామరాజు నడిగి యతనికి స్వతంత్రేచ్ఛ లేదని తెలిసికొనియెను. వెంటనే యావృద్ధనారి దామాజీగాయిక్వాడునకు "ఇచట నీకుఁ బ్రతిపక్షులు లేరుగాన మరాఠేల రాజ్యము బ్రాహ్మణుల (పేష్వాల) పాలుగాకుండఁ గాపాడవల