పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ యుద్ధసమయమునందు రాణిగారు సైన్యమం దంతటను తన దృష్టి నిగిడింపుచు, నచటగల కొదవలను దొలగింపుచు, సైనికుల కనేక బహుమానము లిచ్చుచు, యుద్ధధర్మములను దెలుపుచు, వారిని యుద్ధమునకు బురికొల్పి వారి మనంబుల వీరరస ముద్భవిల్ల జేయుచుండెను. అప్పు డామె మిగుల జాలిపడి వచ్చినవారి కామె సమక్షముననే చికిత్స జరిగింపుచుండెను. అప్పుడామె మిగుల జాలిపడి వారిపైనుండి తన హస్తమును త్రిప్పగా నా సైనికు లధికావేశపరులయి యుద్ధముచేయ నుంకింపుచుండిరి. ఇట్టి స్త్రీరత్నములు జన్మించుటవలననేగదా స్త్రీలకును పురుషులను బోలిన ధైర్యశౌర్యములు గలవని యందరకును దెల్లంబయ్యె.

ఇట్లు 30 వ తేదివరకును యుద్ధము జరిగెను. ఆంగ్లేయ బలంబులి రాణిగారి కోటను భేదింపజాలవయ్యె. ఈ రణరంగమునందు వారి యుద్ధసామగ్రి యంతకంతకు దక్కువగుట వలన వారు జయమునం దంతగా నమ్మకము లేకయుండిరి. ఇంతలో నానాసాహేబు* పేష్వాయొక్క సేనానాయకుడగు తాతాటోపే యను వీరుడు లెక్క కెక్కువయగు సైన్యముతో రాణిగారికి దోడుపడుటకై కాల్టీనుండి వచ్చుచుండెను. ఆ సైన్యము బహుదూరమున నుండగానే యాంగ్లేయ సేనానాయ



  • నానాసాహేబు (రెండవ) బాజీరావు దత్తపుత్రుడు. 1853 వ సంవత్సరపు సిపాయిల స్వామిద్రోహమునకు నితడే పురస్కర్త. ఇంగ్లీషువారి యొద్దనుండి తన పూనారాజ్యము మరల సంపాదించవలయునని యితని యత్నముండెను.