పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

రంగా రాయ చరిత్రము.


క.

 విరియాలగోత్రవారా
కరరాకాకైరవాప్తకారుణ్యరస
స్ఫురణాభరణాధరణీ
భరణక్షమదోఃప్రసరణపండితశరణా.

283


మాలినీ,

 వనధినిభగభీరా వైరివన్యాకుఠారా
తనురుచిజితమారా ధర్మమార్గప్రచారా
జనవినుతవిహారా సత్యవాచోవిచారా
కనకశిఖరిధీరా కాంతమాంబాకుమారా.

284


గద్యము.

 ఇది శ్రీమత్కాశ్యపగోత్ర దిట్టకవివంశపవి త్రాచ్చ
నామాత్యపౌత్ర పాపరాజకవిపుత్ర శ్రీరామచంద్రచర
ణారవిందధ్యానపరాయణ నారాయణాభిధానప్రధాన
మణిప్రణీతం బైన రంగారాయకదనరంగచరిత్రం బను
మహాప్రబంధంబునందు సర్వంబును తృతీయాశ్వాసము.

చెన్నపురి, వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి
ఆదిసరస్వతీనిలయముద్రాక్షరశాలయందు
ముద్రితము 18-9-1914.