పుట:2015.372978.Andhra-Kavithva.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ

54



విరచించెను. కాని మిల్టను రచించిన కావ్యములలో నెల్ల దుర్నీతిపరుఁడును నహం కార స్వరూపియు నగు సై తానుని వర్లనమే యెంతయు రసవత్తరముగ నుండి నీతిబోధకముగ సంతరింపఁబడిన యితర కావ్యభాగములన్నీయుఁ 'బేలవముగ నుండుటయే మిల్టను మతమును దమంతఁదామే యన్యవాద సాహాయ్య మక్కజ లేకుండఁగ నే పూర్వపక్షముఁ గావింపఁ జాలియున్నవి.

4. పోపు మొదలగువారు.

మిల్టన్ తరువాతఁ గవులు సమకాలికాచారవ్యవహారము లను వర్ణించుచుఁ గావ్యము సమకాలికొచారవ్యవహారములను సరియగు పద్ధతిని నడపించు నీతిని మాత్రమే బోధించునని తలంచి కావ్యమునఁ దాత్కాలికోపయోగములగు నీతి సూత్రములను మాత్రమే బోధింపజూచిరి. వారికాప్యముల విశాల ప్రకృతివర్ణ నముగాని విశాలమానవజీవిత వర్లనముగాని సర్వ సమతమగు నీతిబోధముగాని మృగ్యమై తాత్కాలిహోప యోగములగు నీతివిషయము మాత్రమే వర్ణింపఁబడి కావ్య ములన్నియు నొకేతీరున సంతరింపఁబడి మన ప్రబంధముల రీతిని “పొడినదే పాడుము పొంచిపండ్లదాసరీ” యనునిందకు లక్ష్య ములై దేశమునకుఁ గాని కావ్యమునకుఁ గాని 'యే మేలును నొడఁగూర్పంజాలకపోయినవి.

పరాసువిప్లవముతరువాతి కవులు.

ఇంతలో శృంఖలలనన్నియు విదలించి పరాసుజాతీ స్వాతంత్ర్యపతాకను దేశ దేశములకుఁ బంపించునటులఁ బ్రదర్శిం చెను. తోడనే నియమములయెడ భక్తియు, భయమును దగ్గి