పుట:2015.372978.Andhra-Kavithva.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము

రసాత్మకం వాళ్యం కావ్యమ్

53


నాటక లక్షణమును విమర్శించుచు సర్థాంతరన్యాసముగ సర్వ విధములగు కావ్యములకు వర్తించురీతిని నతఁ డోకకావ్య లక్షణ నిర్వచనముఁ గావించెను. నాటకము ప్రకృతిని నద్దమునఁ బోలెఁ బ్రదర్శించునని తెల్పెను. అంతియే కాని నాటకము జనులకు నీతిబోధించునని చెప్ప లేదు. ప్రకృతిని, మానవజీవిత మును గన్నులఁగట్టినట్లుగ రసవంతముగ, స్వతంత్రముగ వర్ణించుటయే కవికృత్యమనియు, నీతిబోధన, ధర్మ శాసనముఁ గవి కనవసరము లనియు నిర్ణయించి షేక్స్పియరు తన కావ్యముల 'నన్ని టిని: బై పద్దతి నే రచించి లోక విఖ్యాతుఁడయ్యె.

3. మిల్టను.

షేక్ స్పియరు తరువాత నింగ్లీషు కవులలో మిల్టన్ అను నతఁడు చాలగొప్పవాడు. ఇతఁడు మతసాంప్రదాయములు బెరిఁగినవాఁడు. చిన్నటనాఁట నుండియు మతావేశము గల వాఁడు. అతనిమతావేశమునకుఁ దోడుగ నింగ్లండు దేశమున నాకాలమున విజయౌద్దత్యము క్షీణించి దురభిమానమునకుఁ బ్రసక్తి "మెండయ్యెను. అందుచే మీల్టను మానవునిజీవిత మంతయు గొప్ప కావ్యము కాఁదగుననియుఁ, గావ్యమున సద్గుణములన్నియు మానవునియందుఁబలె వర్ధిల్లవ లేననియుఁ, గావ్యము మానవుని గుణాభివృద్ధికి దోడ్పడవ లెననియు నెంచి భగవంతునిచర్యలను మానవులకుఁ బ్రదర్శించి మానవ కల్యాణమునకు, ననఁగా మానవజాతి యొక్క, నీత్యభ్యుదయ మునకుఁ దోడ్పడుటకై సృష్టి యొక్క చరిత్రమును, మానవుని యథఃపతనమును, మానవుని పునరుద్దరణమును మొదలగు విషయములను గైకొని నీతిబోధకములగు కావ్యములను