పుట:2015.372978.Andhra-Kavithva.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ణ


గంధము లేని సొమాన్యజను లాడు మోటమాటలకును, సాహిత్య సంస్కారముఁ గలిగి పదిమందిలోఁ దిరుగ నేర్చిన పండి తులు వాడు ప్రౌఢపద ప్రయోగములకును, పండ్లూడి నోట మాట తిన్నఁగ నుచ్చరింపఁజాలక పల్కు ముదుసలిపల్కుల కును సంస్కారమున నెంత యంతరమును వ్యత్యాసమును గలవో సహృదయులకే యెఱుక. జీవద్భాషయం దిట్టిసంస్కార విభేదసూచకములగు విశేషము లెన్ని యేనియుం గన్పట్టుట కవకాశము గలదు. మఱియు జీవద్భాష జీవసూత్రముల నను సరించి లోప సహితయై యుండును. "వెలుంగునతుఁ జీఁకటియుం బోలె, నెండకు నీడయుంబోలె గుణమునకుఁ గించిల్లోపమును దోడుగ వర్తించునని జీవరహస్యవేత్తలకు విదితము. లోప రాహిత్య మొక్క పరమేశ్వరుని విషయముననే చెల్లఁదగిన దగుటచే, మానపు లెల్లరును లోపసహితులే యగుటచే లోప సహితములగు మానవులచే వ్యవహరింపంబడు జీవద్భాష, లోప రహితముగాక లోపసహిత మే యగు. జీవద్భాష వివిధతరు లతాశోభితమై నవనవకుసుమాలంకారభూషితమై నానావిధ ఫల సమృద్ధమై నిత్యశోభఁ గలిగి 'వెలుఁగువనముంబోలె నొప్పా ఱుచు, మానవుని జీవితమునందు నిత్యమును బొడకట్టు విశేష ములతోడను, నద్భుతములతోడను, రస ప్రవృత్తులతోడను నెంతయు విలసిల్లును. అందువలననే జీవద్భాష కఠిననీయమ" ములకు లోనుగాక యథేచ్చముగ నడచుచుండును. కావున బురాతనభాషల ట్లాకల్పాంతస్థాయిత్వము జీవద్భాషలకలవడుట యసంభవము. ప్రాణికోట్ల కెట్లు జీవచ్యుతి కలుగునో యట్లే జీవ ద్భాషలకును గొన్ని యెడలఁ జ్యుతి కల్గుట సహజము, జీవద్బా షలు జీవితసూత్రము ననుసరించి దినదినాభివృద్ధి గాంచు