పుట:2015.372978.Andhra-Kavithva.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

భావప్రకటనము.

295


యింపంజాలము, పండిత జనులవలనీ వ్యవహారమా? పామరుల పలని వ్యవహారమా? సాహిత్యము నందలి వ్యవహారమా? లేక నిత్య జీవితము నందలి వ్యవహారమా! అనుప్రశ్నమునకు సమాధాన మిచ్చుట మిగులఁ గష్టము. కావునం బూర్వకాలము వ్యవహారముల నుండి విశ్రుతవాజ్మయముఁ గల్గి నేఁడును పండితజనులచే వ్యవహరింపఁ బడుచున్న సంస్కృతాది భాషలను మృతభాష లనుటకన్నఁ బురాతనభాష లనుట సమంజసము. వ్యవహారమును వాఙ్మయమును లేక బొత్తుగా నశించిపోయిన మాగధీపై కాచాది భాషలకే మృతభాషలను నామము సెల్ల - దగు. సంస్కృతాది భాషలు పురాతనభాష లే యగు. పురాతనభాషలు సలక్షణములై యవస్థాభేదములకు లోనుగాక, మహా పర్వతములుం బోలె నచలములై, యేకస్థాయి నేలోపము లును జెందక, ఱాతఁ జెక్కఁబడిన బొమ్మల ట్లాకల్పాంతచిరస్థాయి త్వము నొందును.

జీవద్భాషలు జీవసూత్ర బద్ధములై కించిల్లో పసహితమగు నవత చే వీలసిల్లుచుండును.

జీవద్భాష లన్న నో జీవసూత్ర బద్ధములు. జీవి యెట్లు బాల్య యావన కౌమార వార్డక్యాద్యవస్థాభేదములకు లోనగు. చుండునో, అట్లే జీవసూత్ర బద్దమగు 'సజీవద్భాషయు ననేక విధములగు నవభేదములకు లోనగుచుండును. ఇందుల కుదాహరణము... _వివిధజనులచే నుపయోగింపఁబడు భాష వివిధ రీతుల నుండి సంస్కోర విషయమున ననేక భేదములు కల్లి యుండుటేయని యెఱుంగందగు. పసిపిల్లలు పలుకు ముద్దు మాటలకును, బాలురు పల్కు జిలిబిలిపల్కులకును, విద్యా