పుట:2015.372978.Andhra-Kavithva.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భాపనాశక్తి,

230


దుర్లభమును, నసంభవమును కాదని సూచించి ఈ చర్చ ముగించి 'వేవొక విషయమునుగూర్చి ముచ్చటిం చెదను.

స్వాభావికాస్వా భావికవిషయములన నేవి-

ఇంక స్వాభావిక, అస్వాభావికవిషయములకు సంబంధిం చిన వివాదాంశముల రెంటిని సూక్ష్మముగ సూచించి భావనా శక్తిప్రశంసను ముగించెదను. స్వాభావికములన నేమి? అస్వా భావికము లన నేమి? ప్రకృతియందు మన స్థూలదృష్టికి గోచరము లగునంతవఱకే వస్తువులు స్వాభావికములా? తద్విపరీతములుగ నున్న నస్వాభావికములా? పంచతంత్రము, బృహత్కథ మొదలగు పురాతన కథలయందుఁ బక్షులు, మృగములు మానవవాక్కుల సంభాషణను గావించినటుల వర్ణింపఁబడి యున్నది. ఈ పద్ధతి కొంచెము స్వభాపవిపరీతముగ నున్నను గేవలసత్య విదూరమును నస్వాభావికమును గాదనియు, నిట్టిపర్ణనము బాల్యావస్థయందు మానవులకు సహజముగ నుండు చపల స్వభావమును దత్ఫలితముగఁ బిల్లలు జంతువులతోడను అచేతనములతోడను మాట్లాడుటను గ్రహించి, యాభావమునే విస్త రించి వేఱువిధముగ మార్చి యట్టి బాల్య చాపల్యము మానవుని యందు వయసు వచ్చిన పిదపఁగూడ నుండుననియుఁ, దత్కారణ మునఁ బిట్టల మాటలును, జంతువుల పల్కులును మానవుఁడు విని వాని యర్థమును గ్రహించుటకు వీలగుననియు శ్రీయుత రామలింగా రెడ్డి గారు యుక్తియుక్తముగ సమర్థించిరి.

ఇట్టి స్వభావవిపరీతవర్ణ నములయం దెల్లను బరస్పర వైరు ధ్యము లేకుండ రచింపఁగల్గిన కవి ప్రతిభాశాలియే యనం దగును. స్వభావవిపరీతమగు విషయములను.. అనఁగా మానవ