పుట:2015.372978.Andhra-Kavithva.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచమ


రూపములగు మూర్తులను గాంచి, వాని కాకృతి నొసంగి నిరామయమగు శూన్యత కొరయూరును వేరును గల్పించి వర్ణింపఁగలుగునని షేక్స్పియరు మహాకవి భావనాశ క్తియొక్క యేంద్ర జాల ప్రభావమును, కవియొక్క మహత్త్వమును గూడ . వర్ణించినాడు.

2.కోలరెడ్డి,

కోలరిడ్జి (Colaridge) అను నాంగ్లేయకవి తా నొకరాత్రి 'కలలోఁ గాంచిన విషయమును 'Kbla Khan' అను కావ్యశకల మున వర్ణించెను. అయ్యది యేప్రయత్నము లేకుండ నే నిద్దుర మంచమునుండి . లేచుచునే కావ్య రూపమున వెలువడెను. అయ్యది కేవలకల్పన యే యనియు నట్టిదీ ప్రపంచమున నెచ్చ టను గని విని యుండనంత యపరూపమును నవూర్వమును సని యాంగ్లేయసాహిత్య విశారదు 'లెల్లరు నేకగ్రీవముగ నంగీకరించిరి. ఇట్టి యాంగ్లేయవాజ్మయమున నద్వితీయమనియు, కోలరిడ్జి యత్యద్భుత దృష్టిని బ్రదర్శిం చెననియు, నీయొక్క కావ్య 'శకలమువలననే యతని కీర్తి యాకల్పాంత స్థాయిఁ గాంచఁగల దనియు నాంగ్లేయపండితుల యభిప్రాయము, అట్టి కేవలరూప కల్పన యసంభవము కాదు. విషయస్కా రముఁ బడసిన కవులు మూర్తులను బ్రత్యక్షముగఁ గాంచి వర్ణింతురు. అట్టి మూర్తులు కేవలరూపకల్పన లేగాని కవియొక్క చిత్తవృత్తి కేమాత్రమును సంబంధించియుండునవి కావనియు భారతీయ వాజ్మయ చక్రవర్తులందఱికును సువ్య క్తమే. ఈవిషయము మహత్తరమైనది. అందుచేఁ గేవల కల్పనాసామర్థ్యము కవికి