పుట:2015.370800.Shatakasanputamu.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పానకాలురాయఁడే బాల్యావస్థలో చిత్తబోధశతకము వ్రాసి తృప్తికరముగ నుండమిచేఁ బ్రౌఢవయస్సులో మానసబోధశతకము వ్రాసెనేమో యని తోఁచుచున్నది. కవి వృత్తము దెలుపుపద్యము ఇంచుకమార్పుతో రెండుపొత్తములలో నొకేవిధముగా నుంటయుఁగూడ శతకద్వయ మేకకర్తృక మన సాహసము కలిగించుచున్నది.


నందిగామఇట్లు భాషాసేవకులు,

1-1-26శేషాద్రిరమణకవులు