పుట:2015.370800.Shatakasanputamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     వంకను ద్రిప్పుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!80
ఉ. ఏఁడులు నూఱటంచు శ్రుతులెన్నఁగ శ్రీగిరిమీఁద నాఱునూ
     ఱేఁడులు సంచరించు సకలేశ్వర దేవర మాదిరాజు నా
     నేఁడులు నూఱుమన్న భువి నిష్ఠురకాలమహోగ్రదృష్టి క్రొ
     వ్వాఁడులణంపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!81
ఉ. సూత్రము దప్పి గొఱ్ఱె గుడిఁ జొచ్చిన మిండనిఁ జంపి సాక్షిగా
     నో త్రిపురాంతకా! యనుచు నో యని పిల్చిన యల్ల [1]సద్యశః
     పాత్రుఁడు కిన్నరయ్యకును బ్రాణసఖుండగు నిన్నుఁ గొల్తు దే
     వా త్రిజగత్పవిత్ర! బసవా! బసవా! బసవా! వృషాధిపా!82
ఉ. ఒక్కఁడె రుద్రుఁడన్న శ్రుతులొల్లక ప్రేలు పురాణభట్టులన్‌
     వ్రక్కలుసేసి తత్తనువు వారిలు [2]బ్రువ్వులుగాఁగఁ జూచు నా
     కక్కయగారి బిడ్డఁడనగా నుతికెక్కిన నిన్నుఁ బూన్తు మ
     ద్వాక్కలికాసమూహి బసవా! బసవా! బసవా! వృషాధిపా!83
ఉ. డంభమయాన్య దర్శన విడంబనుఁ డష్టమదాపహారి యా
     శుంభ దుదాత్తకీర్తి యగు చోడలదేవర బాచిరాజు వి
     స్రంభసఖుండ వీవని ప్రశంస యొనర్తు జగత్ప్రపూత వి

  1. నాదయా
  2. పురువుశబ్దమున కిది పూర్వరూపము