పుట:2015.370800.Shatakasanputamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     శరణన్న బగవానితమ్మునికి రాజ్యం బిచ్చుట ల్కల్ల యి
     త్తఱి నన్నేలిన నిక్క మీకథలు కృష్ణా! దేవకీనందనా!100
క. ఈకృష్ణశతక మెప్పుడు
     పైకొని విన్నట్టివారు వ్రాసినవారల్‌
     చేకొని పఠించువారలు
     శ్రీకృష్ణునికరుణ కలిగి చెలఁగుదు రెలమిన్‌.101
[1]మ. సదయస్ఫూర్తికళల్ ఘటించు కవిరక్షశ్శ్రేష్ఠుఁ డుత్సాహియై
     పదివేల్ పద్యములందు నూటెనిమిదౌ పద్యము లర్పింప మీ
     పదనీరేజములందు దివ్యతటినీపాథఃప్రపూర్ణాభిము
     ఖ్యదశం గాంచిన దౌట మీ కరుణ కృష్ణా! దేవకీనందనా!


దేవకీనందనశతకము
సంపూర్ణము.

  1. అడయారు లైబ్రరీలోని పుస్తకపాఠము