పుట:2015.333901.Kridabhimanamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నీటైనరత్నాల తాటంకములకాంతి
    కుల్కుగుబ్బలమీద గునిసియాడ
గుఱుతైనయపరంజి గొప్పము త్తెపునత్తు
    మోనిపై నొకవింత ముద్దుగుల్క
తీరైనముత్యాలహారముల్ మేలిమై
      మెఱుగు జెక్కులతోడ మేలమాడ
గంధకస్తురివాసనల్ గమ్మనంగ
నలరువిలుకానిచేతి పూవమ్మనంగ
కాళ్ళసందెలు గలుగల్లున ల్లనంగ
సొగసు గుల్కంగ వేపారిసుదతి వచ్చె
సీ. మీగాళ్ళ జీరాడ మేలైనసరకుతో
             దీరుగా మడిచీర దీర్చి గట్టి
  బిగువుగుబ్బలమీద నిగనిగ ల్దళుకొత్త
      నోరవయ్యెదకొంగు జాఱవైచి
వలపుల కొకవింత గలుగ బా గొప్పగా
    గురుఱు మన్నగ దువ్వి కొప్పు వెట్టి
నెలవంక నామంబు సలలితంబుగ నుంచి
      తిరుచూర్ణ మామీద తీర్పు చేసి
యోరచూపుల విటుల దా నూరడించి
గిల్కు మెట్టెల రవరచ్వ ల్గుల్కరింప
జికిలి చేసినతామ్రంపు జెంబు వూని
వీధి నేతెంచె సాతానివలది యొకతె.