వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆర్కీవ్.ఆర్గ్ లోని తెలుగు పుస్తకాలు

వికీసోర్స్ నుండి
మరింత విస్తృతమైన DLI జాబితా కు  w:వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు_సమాచారం_అందుబాటులోకి  చూడండి.

భారత డిజిటల్ లైబ్రరీ లో 22000పైగా తెలుగు పుస్తకాలు బొమ్మరూపంలో వున్నాయి. వాటినుండి చేర్చిన ఆర్కీవ్.ఆర్గ్ [1]లో స్వేచ్ఛానకలుహక్కులు గల పుస్తకాలు 2265పైగా వున్నాయి. వాటిని తెవికీలోపాఠ్యీకరణ చేస్తే అపారమైన జ్ఞాన సంపద అందరికీ అందుబాటులోకి రాగలదు. మొదటి పుస్తకాల మెటావివరాలు అనగా పుస్తకము పేరు, రచయిత పేరు, విషయం తెలుగులోకి మార్చవలసిన అ‌వసరం వుంది. అందుకని ఈ ప్రాజెక్టు ప్రారంభించడమైనది. ఇంగ్లీషులోగల గుర్తింపు పేరు అక్షరక్రమంలో ఉపపేజీలు ప్రారంభించడమైనది. వీటిలో ఇంగ్లీషు లో ని మెటా వివరాలను తెలుగులోకి మార్చవలసినదిగా కోరడమైనది. దీనికొరకై ప్రతిపదబంధం చివరలో ^ గుర్తు వాడబడినది. వరుస క్రమము

ఆర్కీవ్.ఆర్గ్ కి లింకుతో గుర్తింపుపదము^ఇంగ్లీషు లిపిలో పుస్తకంపేరు^తెలుగులిపిలో పేరు^ఇంగ్లీషులిపిలో రచయిత పేరు^తెలుగులిపిలో రచయితపేరు^ఇంగ్లీషులిపిలో విషయం^తెలుగులో విషయం,^ఇంగ్లీషులిపిలోభాష^
పై వరుసలో ^^మధ్యలో తెలుగులో పేర్లు లేక వివరము చేర్చాలి.

వికీపీడియాలో వ్యాసాలకి సంబంధించిన ఈ జాబితాలోని పుస్తకాలను ఉపయుక్త గ్రంథసూచి అనే శీర్షిక క్రింద అయా వ్యాసాలలో చేర్చండి.

సమయ అంచనా
100పుస్తకాల మెటావివరాలను చేర్చటానికి గంట ఇరవై నిముషాలు పట్టినది.

పనిలో తెలిసినవిషయాలు[మార్చు]

  1. విషయం చాలా వాటికి ఖాళీగా వుంచారు. కొన్ని వాటికి ఉపశీర్షికను రాశారు.
  2. పదబంధాలు వేరుచేయటానికి ^వాడినా కొన్ని చోట్ల & వాడినపుడు పొరపాటున ^ కూడా ఇంగ్లీషు వివరాలలో వున్నది. వాటిని తెలుగు పాఠ్యముచేసినపుడు సరిదిద్దడం జరిగింది.
  3. పుస్తకాల తెలుగు శీర్షికలను ఇంగ్లీషులోకి కొన్నిచోట్లఅనువాదం చేశారు . సంపుటి.భాగం లాంటివి దాదాపు Vol, Part గా వాడారు.
  4. రచయితల పేర్లకు ఒక క్రమము వాడలేదు. ఇంటి పేరు కొన్నిసార్లు మొదటలో కొన్ని సార్లు చివరలో, కొన్ని సార్లు ఇంగ్లీషు మొదటి అక్షరము వాడారు.
  5. చాలా పుస్తకాలకు ఆర్కీవ్.ఆర్గ్ ముందుచూపు పనిచేయటంలేదు.
  6. రామాయణం, మహాభారతం పై చాలా పుస్తకాలున్నాయి.
  7. ఎస్ తో ప్రారంభమయ్యేవి 620పైగా వున్నాయి.ఎందుకంటే శ్రీ అనే అక్షరం చాలావాటికి మొదట అక్షరమైంది.
  8. తెలుగు ప్రముఖులు (టంగుటూరి ప్రకాశం, సురవరం ప్రతాపరెడ్డి, కందుకూరి వీరేశలింగం...) రచించినవి చాలా ఈ జాబితా లోవున్నాయి.
  9. దాదాపు అన్ని రంగాలకు (పురాణాలు, జ్యోతిషం, వైద్యం,కళలు,చరిత్ర...) చెందిన పుస్తకాలు వున్నాయి.
  10. ఇలాగే మొత్తము డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో వున్న తెలుగు పుస్తకాల వివరాలు చేర్చగలిగితే చాలా వుపయోగం.

విషయసూచిక[మార్చు]

విషయాలు: A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z


ఆర్కీవ్.ఆర్గ్ తెలుగు పుస్తకాలు వికీసోర్స్ లో చేర్చుటకు ఉపకరణం[మార్చు]

ఉపకరణం ద్వారా ఆర్కీవ్.ఆర్గ్ లోని పుస్తకాలను కామన్స్లో చేర్చవచ్చు. దీనిని అవసరమైనంతవరకే అనగా వేటినైతే యూనీకోడికరణ చేద్దామనుకుంటున్నారో అంతవరకే వాడడం మంచిది. మరిన్ని వివరాలకు మెయిల్ జట్టు అంశాల వరుస http://lists.wikimedia.org/pipermail/wikisource-l/2014-March/001828.html చూడండి

స్థితి[మార్చు]

ముగిసిన ప్రాజెక్టు

వనరులు[మార్చు]

  1. http://archive.org