హలో...డాక్టర్/అధిక రక్తపీడనము (Hypertension)

వికీసోర్స్ నుండి

3. అధిక రక్తపీడనము

(Hypertension)

రక్తప్రసరణము వలన దేహములో వివిధ అవయవాలకు, కణజాలమునకు ప్రాణవాయువు (oxygen), పోషక పదార్థములు అందింపబడి, వానినుండి బొగ్గుపులుసువాయువు (Carbon di-oxide), మిగిలిన వ్యర్థపదార్థములు తొలగించబడుతాయి. హృదయ సంకోచ, వికాసముల వలన రక్తనాళముల ద్వారా రక్తప్రసరణము జరుగుతుంది.

హృదయములో ఎడమ జఠరిక (Left Ventricle) రక్తమును వివిధ అవయవములకు బృహద్ధమని (Aorta), దాని శాఖలు, ధమనుల ద్వారా చేర్చితే, వివిధ అవయవముల నుండి తిరిగి ఆ రక్తము ఉపసిరలు, ఊర్ధ్వ బృహత్సిర (Superior Venacava), అధో బృహత్సిరల (Inferior Venacava) ద్వారా హృదయములో కుడి భాగమునకు చేరుతుంది. కుడికర్ణికనుంచి కుడిజఠరికకు, కుడిజఠరికనుంచి పుపుసధమని (Pulmonary artery) ద్వారా ఊపిరితిత్తులకు రక్తము చేరి, ఊపిరి తిత్తులలో వాయువుల మార్పిడి జరిగాక (బొగ్గుపులుసు వాయువు తొలగి, ప్రాణవాయువు కూడి) పుపుససిరల (Pulmonary Veins) ద్వారా రక్త ము గుండె ఎడమభాగానికి చేరుతుంది.

రక్తపీడనము:

రక్తప్రసరణకు కొంత పీడనము అవసరము. హృదయములో జఠరికలు వికసించినప్పుడు (Diastole) రక్తప్రవాహముతో అవి నిండుతాయి. అప్పుడు బృహద్ధమని, పుపుస ధమనుల మూలములలో ఉన్న కవాటములు మూసుకొని ఉంటాయి. అప్పుడు  ధమనులలో ఉండే పీడనమును వికాస పీడనము (Diastolic pressure) అంటారు. జఠరికలు ముడుచుకున్నప్పుడు (Systole) రక్తప్రవాహము వలన ధమనులలో పీడనము పెరుగుతుంది. అప్పటి పీడనమును ముకుళిత పీడనము (Systolic Pressure) అంటారు. హృదయ సంకోచ, వికాసముల వలన రక్తనాళములలో రక్తము పరంపరలుగా ప్రవహిస్తుంది. రక్తపీడనమును పాదరస మట్టముతో కొలుస్తారు. ధమనులలో ఉండే రక్తపీడనము గురించి చర్చిస్తాను.       వయోజనులలో ముకుళిత పీడనము (ఈ సంఖ్యను పైన సూచిస్తారు) 100 నుంచి 140 మిల్లీమీటర్ల పాదరస ప్రమాణములోను, వికాసపీడనము (ఈ సంఖ్యను క్రింద సూచిస్తారు) 60  నుంచి 90 మిల్లీమీటర్ల పాదరస ప్రమాణములోను ఉండుట సామాన్యముగా పరిగణించబడుతుంది. అధిక రక ్తపీడనము :

రక్తపీడనము నిలకడగా 140/90 మి.మీ. దాటి ఉంటే దానిని వైద్యులు అధిక రక్తపీడనముగ (రక్తపు పోటు; Hypertension) పరిగణిస్తారు. ఏదో ఒక్కక్క సారి ఆందోళన, భయము వంటి కారణముల వలన రక్త పీడనము కొంచెము హెచ్చినంత మాత్రమున దానిని రక్తపు పోటుగా పరిగణించరాదు. విశ్రాంతముగా కొద్దిసేపు కూర్చున్నాక రెండు, మూడు పర్యాయములు, లేక దినములో పెక్కు సార్లు పరిపాటిగా దినదిన కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నపుడు తీసుకొనే రక్తపీడనపు విలువలు (Ambulatory Pressures) బట్టి రక్తపు పోటుని నిర్ణయించాలి. రక్తపుపోటు  అదుపులో లేక ఎక్కువ కాలము ఉండుట వలన గుండెపోటు, గుండె బలహీనత, హృదయ వైఫల్యము (Congestive Heart failure), మస్తిష్క విఘాతాలు (Cerebro Vascular Accidents), మూత్రాంగముల వైఫల్యము (Renal failure), దృష్టి లోపములు వంటి విషమ పరిణామములు కలుగుతాయి. అందువలన రక్తపు పోటును అదుపులో పెట్టుకోవలసిన అవసరము ఉన్నది. అధిక సంఖ్యాకులలో అధికపీడనము (95 శాతమునకు మించి) ప్రధాన అధికపీడనము (Primary Hypertension). అంటే దానికి యితర కారణాలు ఉండవు. కొద్దిమందిలో  (సుమారు 5 శాతము మందిలో) అది యితర వ్యాధుల వలన కలుగుతుంది. అప్పుడు దానిని అప్రధాన అధికపీడనముగా (Secondary Hypertension) పరిగణిస్తారు. గళగ్రంథి స్రావకములు (Thyroid hormones) ఎక్కువ అవడము, తక్కువ అవడము,

41 :: అడ్రినల్ కార్టికో స్టీరాయిడ్ లు (adrenal corticosteroids) ఎక్కువ

కావడము (Cushing Syndrome), ఆల్డోస్టీరోన్ (aldosterone) ఎక్కువ కావడము (Primary Hyperaldosteronism), సహగళగ్రంథి స్రావకము (Parathyroid hormone) ఎక్కువ అవడము వంటి వినాళగ్రంధుల వ్యాధులు, ఫియోఖ్రోమోసైటోమా,  మూత్రాంగముల వ్యాధులు (kidney diseases), మూత్రాంగ ధమనుల ఇరకటము (Renal artery stenosis) వలన కలిగే రక్తపుపోటులు అప్రధానపు రక్తపుపోటులు. అప్పుడు రక్తపు పోటును అదుపులో పెట్టుకొని అసలు వ్యాధులకు చికిత్స చెయ్యాలి. శస్త్రచికిత్సలు కూడా అవసరము కావచ్చును.

ఇతర కారణాలు లేకుండా కలిగే ప్రధాన అధికపీడనము జన్యు సంబంధమైనది కావచ్చును. ఉప్పు వాడుక ఎక్కువగుట, వ్యాయామ లోపము, మద్యము వినియోగము, మాదక ద్రవ్యాల వినియోగము, పొగ త్రాగుట, స్థూలకాయము రక్తపుపోటు కలుగుటకు తోడ్పడుతాయి. రక ్తపీడనము ఎలా కలుగుతుంది ?

    రక్తప్రసరణకు రక్తనాళముల నుండి కలిగే ప్రతిఘటన వలన రక్తపీడనము కలుగుతుంది. దేహములో రెనిన్, ఏంజియోటెన్సిన్ల వ్యవస్థ, సహవేదన నాడీమండలము (Sympathetic Nervous system) రక్త నా ళములలోని మృదుకండరాల (Smooth muscles) బిగుతును (Constriction) నియంత్రిస్తాయి.

మూత్రాంగములలో రెనిన్ ఉత్పత్తి చెంది రక్తములోనికి విడుదల అవుతుంది. ఈ రెనిన్ కాలేయములో ఉత్పత్తి అయే ఏంజియోటెన్సినోజన్ (Angiotensinogen) ని ఏంజియోటెన్సిన్-1 గా మారుస్తుంది.ఏంజియో టెన్సిన్-1 కణజాలములో ఉండే ఏంజియోటెన్సిన్ కన్వెర్ట ిం గ్ ఎంజైము వలన  ఏంజియోటెన్సిన్-2 గా  (angiotensin-2) మారుతుంది. ఏంజియో టెన్సిన్-2 రక్తనాళ కండరాలను సంకోచింపజేసి, రక్తనాళముల బిగుతును పెంచుతుంది. ఏంజియోటెన్సిన్-2 ఎడ్రినల్ గ్రంథుల నుంచి ఆల్డోస్టెరోన్ ని (aldosterone) కూడా విడుదల కావిస్తుంది. ఆల్డోస్టెరోన్ శరీరములో

42 :: సోడియంని పెంచుతుంది.

సహవేదన నాడీమండలము, ఎడ్రినల్ గ్రంథుల నుంచి విడుదల అయే ఎడ్రినలిన్, నారడ్రినలిన్ హార్మోనులు (Catecholamines) కూడా రక్తనాళపు మృదుకండరాలను నియంత్రిస్తాయి. ఇవి గుండె వేగమును, గుండె సంకోచ ప్రక్రియను (contractility) ఇనుమడింప జేస్తాయి. పై ప్రక్రియల ప్రభావము ఎక్కువయి నప్పుడు రక్తపీడనము పెరిగి అధిక రక్తపీడనము కలుగుతుంది. రక ్తపుపోటు లక్షణములు :

చాలా మందిలో రక్తపుపోటు చాలాకాలము ఎట్టి లక్షణాలు, నలతలు చూపించదు. రక్తపీడనము కొలుచుట వలనే ఈ రుగ్మతను  కనిపెట్టగలము.

తలనొప్పి, కళ్ళు తిరగడము, ఒళ్ళు తూలిపోవడము వంటి  లక్షణములు కొందఱిలో కలుగవచ్చును. ఒంట్లో బాగానే ఉందని రక్తపుపోటుని నిర్లక్ష్యము చేయకూడదు. మధ్య మధ్యలో కొలుచు కోకుండా రక్తపుపోటు అదుపులోనే ఉన్నదని భ్రమించకూడదు. గుండె వ్యాధులు, మూత్రాంగముల వైఫల్యము (renal failure), మస్తిష్క విఘాతములు (cerebral strokes), దూర రక్తనాళ ప్రసరణ లోపములు (Peripheral Vascular insfficiency), అంధత్వము వంటి పరిణామముల వలనే రక్తపుపోటు కొంతమందిలో తొలిసారిగా కనుగొనబడవచ్చును. లక్షణాలు పొడచూపక పెక్కు అవయవాలపై చెడు ప్రభావము చూపిస్తుంది కాబట్టి మధ్య మధ్య రక్తపీడనము పరీక్షించుకోవలసిన అవసరము ఉన్నది. ఎక్కువగా ఉంటే చికిత్స అవసరము. పరీక్షలు :

రక్తపుపోటు ఉన్నదని నిర్ధారణ చేసాక కొన్ని పరీక్షలు అవసరము. రక్తకణ గణనములు (Complete Blood Counts), రక్త రసాయన పరీక్షలు (Blood Chemistry), మూత్రాంగముల వ్యాపార పరీక్షలు (Renal functions), మూత్రపరీక్షలు, అవసరమనిపిస్తే, హార్మోను పరీక్షలు, విద్యుత్

43 :: హృల్లేఖనము (electrocardiography) వంటి పరీక్షలు అవసరము. నేత్రబింబ

పరీక్షలు (Fundoscopy) కూడా అవసరమే.

సంకోచ పీడనము (Systolic Pressure) 180 మి.మీ. మెర్క్యురీ పైన, వికాస పీడనము (Diastolic Pressure) 110 మి.మీ  మెర్కురీ దాటితే దానిని అధిక రక్తపీడన సంక్షోభముగా (Hypertensive Crisis) పరిగణిస్తారు. హృదయము, మెదడు, మూత్రాంగములు, కళ్ళపై దీని ప్రభావము కనిపిస్తే ఈ పీడన సంక్షోభాన్ని అత్యవసర పరిస్థి తి గా పరిగణించి చికిత్స చెయ్యాలి. సిరలద్వారా ఎక్కించే ఔషధాలు (Intravenous drugs) అవసరము అవవచ్చును. ఎట్టి విపత్తులు లేకపోతే  నోటి ద్వారా మందులు ఇచ్చి  చికిత్స చెయ్యవచ్చును. చికిత్స :

రక్తపుపోటు ఉన్నదని నిర్ధారణ చేసాక, యితరవ్యాధి లక్షణాలు లేవని రూఢీ చేసి, తగిన పరీక్షలు చేస్తూ, వ్యాధికి చికిత్స చెయ్యాలి. అధిక పీడనము సాధారణ పరిమితులకు దగఱ ్గ లో ఉన్నప్పుడు ఔషధముల అవసరము లేకుండా జీవనశైలి మార్పులతో దానిని అదుపులో పెట్టగలిగే అవకాశము ఉన్నది. అదుపులో ఉంచలేనపుడు, పీడనపు విలువలు అధికముగా ఉన్నప్పుడు మందులు వాడుక అవసరము. జీవన శైలి మార్పులు :

శరీరానికి తగినంత వ్యాయామము చాలా అవసరము. శ్రామికులు ఆరోగ్యవంతులుగాను దీర్ఘాయుష్కులుగాను ఉండుట గమనిస్తుంటాము. ఈ వాహనయుగములో ప్రజలకు నడక, వ్యాయామము తగ్గింది. తగినంత వ్యాయామము చేయుట, ఉప్పు, కొవ్వుపదార్థాల వాడుక తగ్గించుట, మితముగా భుజించుట, స్థూలకాయములను తగ్గించుట, పొగత్రాగుట మానుట, మద్య వినియోగమును మితములో ఉంచుకొనుట, మాదకద్రవ్యాల వినియోగములు మానుట రక్తపుపోటును అదుపులో ఉంచుటకు చాలా అవసరము.

44 :: ఔషధములు :మూత్రకారకములు (Diuretics)

అధిక రక్తపీడనమును అదుపులో ఉంచుటకు వివిధ తరగతుల ఔషధాలు ఉన్నాయి. ప్రప్రథమముగా, సాధు మూత్రకారకములను (Diuretics) వినియోగిస్తాము. ఇవి లవణ నష్ట ము ను, జల నష్ట ము ను కలుగజేసి, రక్త పరిమాణమును తగ్గించి రక్త నా ళముల పీడనమును తగ్గి స్తా యి. కణముల లోపల సోడియం తగ్గి న ప్పుడు రక్త నా ళములలోని కండరముల బిగుతు తగ్గుతుంది. థయజైడ్ (Thiazide) మూత్ర కారకములను రక్తపుపోటుకు తఱచు వాడుతారు. స్పైరనోలాక్టోన్ (spironolactone) వంటి ఆల్డోష్టిరోన్ అవరోధకములను కూడా థయజైడ్ మూత్రకారకములకు జతపఱచవచ్చును. కొందఱిలో మూత్రాంకముల (nephrons) మెలికలపై (loops) పనిచేయు ఫ్యురొసిమైడ్ (Furosemide) వంటి మూత్రకారకములను (Loop diuretics) ఉపయోగిస్తారు. మూత్రకారకములు వాడేటపుడు విద్యుద్వాహక లవణములకు (electrolytes) రక్తపరీక్షలు మధ్య మధ్యలో చేయాలి. బీటా ఎడ్రినల్ గ్రాహక అవరోధకములు (beta adrenergic receptor blockers)

బీటా ఎడ్రినల్ గ్రాహక అవరోధకములు  బీటా అడ్రినల్ గ్రాహకములను (beta adrenergic receptors) అవరోధించి ఎడ్రినలిన్, నారెడ్రినలిన్ వంటి ఖాటికాలైమన్ల (catecholamines) ప్రభావమును తగ్గిస్తాయి. అందు వలన రక్తనాళములలో బిగుతు తగ్గుతుంది. ఇవి హృదయవేగమును తగ్గించి, హృదయ వికాసమును పెంచి అధికపీడన నివారణకు తోడ్పడుతాయి. ఏంజియోటెన్సిన్ కన్వెర్ట ింగ్ ఎంజై ం ఇన్హి బిటర్లు (Angiotensin Converting Enzyme inhibitors)

ఇవి ఏంజియోటెన్సిన్ 1 ను ఏంజియోటెన్సిన్ -2 గా మార్పు చెందకుండా అరికట్టి, రక్త నా ళములలో బిగుతు తగ్గించి, రక్త పుపోటు తగ్గి స్తా యి. ఈ ఔషధములను వాడేటపుడు కొద్ది వారములు తఱచు మూత్రాంగ వ్యాపార పరీక్షలకు, పొటాసియము విలువలకు రక్తపరీక్షలు చేసి వాటిని గమనించాలి. రక్తములో క్రియటినిన్ ప్రారంభపు విలువకంటె 30 శాతము పెరుగకుండ

45 :: వైద్యులు గమనిస్తూ ఉండాలి. రక్తద్రవపు పొటాసియం (serum potassium)

పరిమితులు దాటకుండా గమనించాలి. 0.7 శాతము మందిలో చర్మము క్రింద గాని, శ్లేష్మపు పొరల (mucous membranes) క్రిందగాని పెదాలు, నాలుక, కనుల క్రింద కణజాలములో అసహనపు పొంగు (Angioedema) కలిగే అవకాశము ఉంది. వారిలో  ACE inhibitors ను ఆపివేయాలి. ఇవి కొందఱిలో దగ్గు కలుగజేస్తాయి. దగ్గు తీవ్రముగా ఉన్నవారిలో కూడ ఈ ఔషధములకు ప్రత్యమ్నాయములను వాడుకోవాలి. ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములు (Angiotensin Receptor Blockers)

ఇవి ఏంజియొటెన్సిన్ 2 గ్రాహకములను  అడ్డుకొనుట వలన ఏంజియో టెన్సిన్ 2 నిర్వీర్యమయి ధమనికల బిగుతు తగ్గుతుంది. రక్తపుపోటు తగ్గుతుంది. ఆల్డోస్టెరోన్ ఉత్పత్తిని కూడా ఇవి తగ్గిస్తాయి. ACE inhibitors సహించని వారిలో వీటిని ప్రయత్నించవచ్చును. వీటిని వాడేటపుడు కూడా తఱచు రక్తపరీక్షలతో మూత్రాంగ వ్యాపారమును, పొటాసియమ్ విలువలను పరిశీలిస్తూ ఉండాలి. ఆల్ఫా ఎడ్రినెర్జిక్ గ్రాహక అవరోధకములు (Alpha adrenergic receptor blockers)

ఇవి ఆల్ఫా అడ్రినల్ గ్రాహకములను  నిరోధించి రక్తనాళములపై అడ్రినల్ హార్మోనుల ప్రభావమును తగ్గిస్తాయి. ధమనికల బిగుతును తగ్గిస్తాయి. ప్రాజొసిన్ (Prazosin), టెరజోసిన్ (Terazosin), డోక్సొజొసిన్ (doxazosin) ఈ తరగతికి చెందిన ఔషధములు. రక్తపీడనమును తగ్గించుటలో మిగిలిన తరగతులకు చెందిన ఔషధములు వీనికంటె మెరుగైనవి. ఇవి తొలిదినము రక్తపీడనమును తగ్గించినట్లు తరువాత తగ్గించవు. కళ్ళు తిరుగుట, నిట్టనిలువు స్థితిలో రక్తపీడనము తగ్గుట (orthostatic hypotension), తలనొప్పి వంటి అవాంఛిత ఫలితములు ముందు కలిగినా అవి క్రమేణా తగ్గుతాయి. కాల్సియమ్ మార్గ   అవరోధకములు (Calcium channel blockers)   

ఈ ఔషధములు కణముల కాల్సియం మార్గములను బంధించి కాల్సియం గమనమును అరికట్టి రక్తనాళములలో మృదుకండరముల సంకోచమును

46 :: తగ్గించి ధమనులను వ్యాకోచింపజేసి, రక్త పీ డనమును తగ్గి స్తా యి. ఇవి

హృదయమునకు  రక్తప్రసరణ పెంచుతాయి. హృద్ధమనుల ప్రసరణ లోపములు (Ischemia), అధిక రక్త పీ డనము కలవారిలోను, ఇతర ఔషధములతో రక్తపీడనము లొంగనివారిలోను వీటి ప్రయోజనము కలదు. వీనిలో డైహైడ్రోపైరిడిన్ (dihydropyridines) తరగతికి చెందని వెరాపమిల్ (Verapamil), డిల్టియజెమ్ (Diltiazem) హృదయ మాంద్యమును (bradycardia) కలిగించగలవు. హృదయ కండరముల సంకోచమును (contractility) తగ్గించగలవు. అందుచే హృదయ మాంద్యము, ప్రేరణ ప్రసరణ లోపములు (Impulse conduction defects) కలవారిలోను, హృదయ వైఫల్యము (Congestive heart failure) కలవారిలోను వీటి వాడుకలో జాగ్రత్త అవసరము. డైహైడ్రోపైరిడిన్ తరగతికి చెందిన ఏమ్లోడైపిన్ (amlodipine), ఫెలోడైపిన్ (felodipine) వంటి మందులు హృదయ మాంద్యమును కలిగించవు, హృదయ సంకోచమును అంతగా తగ్గించవు. కాని వీటి వలన పాదములలో పొంగు కలుగవచ్చును. నారంగకాలేయ వ్యాధిగ్రస్థులలో (cirrhosis of liver) కాల్సియం మార్గ అవరోధకముల మోతాదులు తగ్గించవలసి ఉంటుంది. మస్తిష్క కేంద్ర ఔషధములు (Centrally acting adrenergic agents) :

క్లానిడిన్ (Clonidine) ఈ కోవకు చెందిన మందు. ఇది మస్తిష్క మూలములో ఆల్ఫా-2 గ్రాహకములను ఉత్తేజపఱచి కాటిఖాలమైన్ల (catecholamines) విడుదలను తగ్గించి రక్తనాళముల బిగుతును తగ్గించి రక్తపీడనమును తగ్గిస్తుంది. దీని వలన హృదయ మాంద్యము (bradycardia), మత్తుదల (drowsiness), నోరు పిడచకట్టుకొనుట వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. సత్వర ఉపసంహరణము (acute withdrawal) వలన రక్తపీడనము బాగా పెరుగుట, గుండెవేగము పెరుగుట, ఒళ్ళు చెమర్చుట వంటి లక్షణములు కనిపిస్తాయి. ప్రత్యక్ష రక ్తనాళ వ్యాకోచకములు (Direct vasodilators) :

ఈ ఔషధములు ప్రత్యక్షముగా రక్తనాళములపై పనిచేసి వాటి బిగుతును

47 :: తగ్గించి రక్తపీడనము తగ్గిస్తాయి. మిగిలిన ఔషధములకు తగని

్గ రక్తపు పోటునకు వీటిని వాడుతారు.

హైడ్రాలజిన్ ను (Hydralazine) గర్భిణీ స్త్రీలలో రక్తపీడనము అదుపులో పెట్టుటకు కూడా ఉపయోగిస్తారు. హైడ్రాలజిన్ వలన గుండెవేగము హెచ్చి హృద్ధమని వ్యాధిగ్రస్థులలో గుండెనొప్పి, గుండెపోటులు కలుగగలవు. ఇది రెనిన్ విలువలు పెంచి శరీర ద్రవపరిమాణమును పెంచగలదు. ఈ అవాంఛిత ఫలితములను అరికట్టుటకు దీనిని బీటా గ్రాహక అవరోధకములతోను (beta adrenergic receptor blockers), మూత్ర కారకములతోను (diuretics) కలిపి వాడుతారు. లూపస్ వంటి వ్యాధి దీని వలన కలిగితే ఈ మందును ఆపివేయాలి. దీని వలన తలనొప్పి, వాంతులు, గుండెవేగము పెరుగుట, నిట్టనిలువు స్థితిలో రక్తపీడనము తగ్గుట (postural hypotension) వంటి అవాంఛిత ఫలితములు కొందఱిలో కలుగుతాయి.

మినాక్సిడిల్ (Minoxidil) వాడే వారిలో బరువు హెచ్చుట, రోమములు ఎక్కువగా పెరుగుట (hypertrichosis), హృత్కోశములో నీరుపట్టుట (pericardial effusion) వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. ఇంకా పలురకాల మందులు అధికపీడన నివారణకు ఉన్నాయి.

ఏ ఔషధమైనా అనుకూల ఫలితాలనే గాక ప్రతికూల ఫలితాలను కూడా కలిగించవచ్చును. కాబట్టి వైద్యులు వాటిని గమనిస్తూ ఉండాలి. మూత్ర కారకములను వాడేటపుడు, పొటాసియము విలువలను మధ్య మధ్య పరీక్షించాలి. రక్తపుపోటును అదుపులో ఉంచుటకు కొందఱికి అనేక ఔషధాల అవసరము కలుగవచ్చును. రక్తపుపోటు ఎక్కువగా ఉన్నపుడు ఎట్టి నలత చూపించకపోయినా, అవయవాలపై దీర్ఘకాలిక దుష్ఫలితాలను కలిగిస్తుంది. అధికపీడన సంక్షోభము సంభవిస్తే గుండెపోటు, మస్తిష్క విఘాతము, దృష్టిలోపము, మూత్రాంగవైఫల్యము, హృదయవైఫల్యము వంటి విషమ సంఘటనలు కలుగవచ్చును. అందువలన వీలు కలిగించుకొని, అప్పుడప్పుడు రక్తపీడనము పరీక్షించుకోవాలి. వైద్యులను సంప్రదించి వారి

48 :: సలహాలు అనుసరించాలి. ఆరోగ్యవిషయ పరిజ్ఞానము సమకూర్చుకొనుట

చాలా మంచిది. కాని సంపూర్ణ పరిజ్ఞానము, అవగాహన, అనుభవము ఆ వృత్తిలో లేనివారికి కలుగదు కాబట్టి వైద్యుల సలహాలను పాటించుట అవసరము.

49 ::