శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి

వికీసోర్స్ నుండి
(శ్రీ పార్వతీదేవీ చేకోవె నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search

శ్రీ కాళహస్తీశ్వర మహత్యం (1954) సినిమా కోసం తోలేటి వెంకటరెడ్డి రచించిన భక్తి గీతం.


పల్లవి :

శ్రీ పార్వతీదేవీ చేకోవె శైలకుమారీ

మా పూజలే తల్లి గౌరీ శంకరీ గౌరీ శంకరీ ||| శ్రీ పార్వతీదేవీ |||


చరణం 1 :

ప్రాపు నీవె పాపహారి పత్మపత్రనేత్రీ ||| ప్రాపు నీవె |||

కాపాడరావమ్మా కాత్యాయినీ ||| కాపాడరావమ్మ ||| ||| శ్రీ పార్వతీదేవీ |||


చరణం 2 :

నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవీ ||| నిన్ను నమ్మినాను |||

పాలించరావమ్మా పరమేశ్వరీ ||| పాలించరావమ్మా ||| ||| శ్రీ పార్వతీదేవీ |||