మొల్ల రామాయణం/బాలకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

బాలకాండము

---


సీ. సరయూనదీతీరసతతసన్మంగళ
      ప్రాభవోన్నతమహావైభవమ్ము
   కనకగోపురహార్మ్యఘనకవాటోజ్జ్వల
      త్ప్రాకారగోపురశ్రీకరమ్ము
   గజవాజిరథభటగణికాతపత్రచా
      మరకేతుతోరణమండితమ్ము
   ధరణీవధూటికాభరణవిభ్రమరేఖ
      దరిసించుమాణిక్యదర్పణమ్ము

తే. భానుకులదీపరాజన్యపట్టభద్ర
   భాసినవరత్నఖచితసింహాసనమ్ము
   నాఁగ నుతి కెక్కు మహిమ ననారతమ్ము
   ధర్మనిలయమ్ము మహి నయోధ్యాపురమ్ము.

సీ. మదనాగయూథసమగ్రదేశము గాని
      కుటిలవర్తన శేషకులము గాదు
   ఆహవోర్వీజయహరినివాసము గాని
      కీశసముత్కరాంకితము గాదు
   సుందరస్యందనమందిరం బగుఁ గాని
      సంతతమంజుళాశ్రయము గాదు

   మోహనగణికాసమూహగేయము గాని
      యూధికానికరసంయుతము గాదు

తే. సరస సత్పుణ్యజననివాసమ్ము గాని
   కఠిననిర్దయదైత్యసంఘమ్ము గాదు
   కాదు కాదని కొనియాడఁ గలిగినట్టి
   పురవరాగ్రమ్ము సాకేతపురవరమ్ము.

సీ. భూరివిద్యాప్రౌఢి శారదాపీఠ మై
     గణుతింప సత్యలోకమ్మువోలె
   మహనీయగుణసర్వమంగళావాసమై
     పొగడొందుకైలాసనగమువోలె
   లలితసంపచ్ఛాలిలక్ష్మీనివాసమై
     యురవైనవై కుంఠపురమువోలె
   విరచితప్రఖ్యాతహరిచందనాఢ్యమై
     యారూఢి నమరాలయమ్మువోలె

తే. రాజరాజనివాసమై తేజరిల్లి
   నరవరోత్తరదిగ్భాగనగరివోలె
   సకలజనములు గొనియాడ జగములందుఁ
   బొలుపుమీరును సాకేతపురవరమ్ము.

క. ఇమ్ముల నప్పురి వప్రము
   కొమ్ములపై నుండి పురముకొమ్ములు వేడ్క౯
   దమ్ములచుట్టముపదజల
   జమ్ములు పూజింతు రొగి నజస్రముఁ బ్రీతి౯.

క. పరువున మురువై యుండును
   సురపురమునఁ గల్పతరులు చూపఱ కింపై

పరువున మురువై యుండును
దురగంబు లయోధ్యఁ గలప్రతోళికలందున్.
క.దానగుణమ్మున సురపురి
నేనాఁడును నమరరత్న మెన్నిక కెక్కున్
దానగుణంబున మిక్కిలి
యేనుఁగు లాపురములోన నెన్నిక కెక్కున్.
<poem>క.కవిగురుబుధమిత్త్రాదులు
వివిధార్చనలం బురమున వెలయుదు రెలమిన్.
గవిగురుబుధ మిత్రాదులు
వివిధార్చనలం బురమున వెలయుదు రెపుడున్

క.భోగానురాగసంపద భోగులు వర్తింతు రందు భూనుతలీలన్ భోగానురాగసంపద భోగులు వర్తింతు రిందు భూనుతలీలన్.

సీ. ప్రకటానురాగసంపన్ను లౌదురు గాని రమణీయరుక్మ కారకులుగారు శుభపవిత్రోజ్జ్వల సూత్రధారులు గాని టక్కరిహాస్యనాటకులు గారు ఉభయసంధాధి విధ్యుక్తకర్ములు గాని చర్చింపఁగా నిశాచరులు గారు తలకించి చూడ సద్ద్విజు లౌదురేకాని తలఁపంగఁ బక్షిజాతములు కారు

తే.బాడబులు గాని యగ్నిరూపములు గారు పండితులు గాని విజ్ఞులపగిదిఁగారు

</poem>

ధీవరులు గాని జాతినిందితులు గారు
పరమవావను లావురి ధరిణిసురులు. 9
ఉ. రాజులు కాంతియందు రతిరాజులు రూపుమునందు వాహినీ
రాజులు దనమందు మృగరాజులు విక్రమకేళియందు గో
రాజులు భోగమందు దినరాజులు సంతతతేజమందు రా
రాజులు మానమందు నగరమ్మున రాజకుమారు లందఱున్

సీ. తగ చానవిఖ్యాతి ధరుఁగుబేరులు గాని
సతాతాంగకుష్ఠపీడితులు గారు
నిర్మలసత్యోక్తి ధర్మసూతులు గాని
చర్చింప ననృతభాషకులు గారు
ప్రకటవిభూతిసౌభాగ్యరుద్రులు గాని
వసుధపై రోషమానసులు గారు
కమనీయగాంభీర్యఘనసముద్రులు గాని
యతులితభంగసంగతులు గారు

తే. వర్తకులు గాని పక్షు లేవరునఁ గారు
భోగులేకాని పాము లెప్పుడును గారు
సరసులే కాని కొలఁకులజాడఁ గారు
వన్నె కెక్కినయప్పురి వైశ్యు లెల్ల.

క.పంటల భాగ్యము గలరై
పంటలపైఁ బంట లమర బ్రతుకుదు రెపుడున్
బంటులుఁ బాడియుఁ గలయా
పంటలు మొదలైన కాఁపుబ్రజలానగరిన్.

సీ. కలికిచూపుల చేతఁ గరఁగింప నేర్తురు
బ్రహ్మచారులనైన భ్రాంతి గొలిపి


మృదువచోరచనల వదలింప నేర్తురు
ఘనమునీంద్రుల నైనఁ గచ్చడములు
వలపులు పైఁ జల్లి వలపిప నేర్తురు
సన్యాసులను నైనఁ జలముపట్టి
సరతబంధమ్ములఁ జొక్కింప నేర్తురు
వ్రతములు గైకొన్నయతులనైన

తే. అచల మెక్కింప నేరుతు రౌషధముల
మరులు గొలువంగ నేర్తురు మంత్రములను
ధనము లంకింప నేర్తురు మంత్రములను
వాసి కెక్కినయప్పురివారసతులు. 13
సీ. శారదాగాయత్త్రి శాండిల్యగాలవ
కపిలకౌశికకులఖ్యాతి గలిగి
మదన విష్వక్సేన మాధవ నారద
శుక నైజయంతి కార్జునులు గలిగి
చంద్రార్క గుహ గిరిసంభవ జయ వృష
కుంభ బాణాదులఁ గొమరు మిగిలి
సుమన ఐరావత సురభిశక్రామృత
పారిజాతముల సొంపారఁ గలిగి
తే. బ్రహ్మనిలయమ్ము వైకుంఠపట్టణమ్ము
నాగకంకణుశైలమ్ము నాకపురము
లలితగతిఁ బోలి యేవేళఁ దులను దూఁగి
ఘనత నొప్పారు నప్పురివనము లెల్ల. 14

చ. కనకవిలాసకుంభములు గబ్బికుచంబుల లీలఁ జిత్రకే
తనములు పైఁటకొంగులవిధంబునఁగ్రాల గవాక్షముల్రహిన్

గనుఁగవయట్ల పొల్పెసఁగఁగా భువిబోగులు మెచ్చ భోగినీ
జనములరీతిఁ జెల్వమరు సౌధనికాయము పాయ కప్పురిన్.

తే. మకరకచ్ఛపశంఖపద్మములు గలిగి
ధనదునగరమ్ముపైఁ గాలు ద్రవ్యుచుండు
సరసమాధుర్యగాంభీర్యసరణిఁ బేర్చి
గుఱుతు మీఱినయప్పురికొలఁకు లెల్ల.

తే. అమృత ధారాప్రవాహమ్మునందు నెపుడు
నొక్క ధేనువు దివి నున్న నుచిత మగునె
అమృతధారా ప్రవాహమ్మునందు నెపుడు
బెక్కు ధేనువు లప్పురిఁ బేరు నొందు.

క. ఈరణి సకలవిభవ
శ్రీకర మయి తాఁ బ్రసిద్ధిఁ జెలఁగుచు మహిమన్
నాకపురితోడ నొఱయుచు
సాకేతపురమ్ము వెలయు జగము నుతింపన్.

వ. అట్టిమహాపట్టణంబున కధీశ్వరుం డెట్టివాఁ డనఁగ.

సీ. తనకీర్తికరపూరతతి చేత వాసించెఁ
బటుతరబ్రహ్మాండభాండ మెల్లఁ
దనశౌర్యదీప్తిచే నిగబింబ మనయంబుఁ
బగలెల్ల మాఁగుడువడఁగఁ చేసెఁ
దనదానవిఖ్యాతి ననుదినంబును నర్థి
దారిద్ర్యములు వెళ్ళఁ బాఱఁ దఱిమెఁ
దననీతిమహీమచే జనలోక మంతయుఁ
దగిలి సంతతమును బొగడఁ దనరె

తే. భళిర. కొనియాడఁ బాత్ర మైపరఁగినట్టి
వైరినృపజాల మేఘసమీరణుండు


దినకరాన్వయపాథోధివజవైరి
నిశికౌక్షేయకకరుండు దశరథుండు.

సీ.వాలింపఁ డవినీతిపరుల మన్ననఁ జేసి
పాలించు సజ్జన ప్రతతి నెపుడు
మనుపఁ డెన్నఁడు జోరులను గారవము చేసి
మనుచు నాశ్రితకోటి ఘనము గాఁగ
వెఱ పెఱుఁగఁడు వైరివీరులఁ బొడఁగన్న
వెఱచు బొం కేయెడ దొరలునొ యని
తలఁకఁ డర్థివ్రాతములు మీఱి పైకొన్నఁ
దలఁకు ధర్మమ్మెందుఁ దప్పునొ యని

తే. సరవిఁ బోషింపఁ డరిగణషట్క మెపుడు
వెలయఁ బోషించు నిత్యమ్ము విప్రనరుల
భాస్కరాన్వయ తేజోవిభాసితుండు
మానధుర్యుండు దశరథక్ష్మావరుండు.

సీ.కనఁ గోరఁ డొకనాఁడుఁ గన్నురఁ బరవధూ
లావణ్యసౌభాగ్యలక్షణములు
వినఁ గోరఁ డొకనాఁడు వీనుల కింపుగాఁ
గొలుచువారల మీఁది కొండెములను
చిత్తంబు వెడలించు జిహ్వాగ్రమునఁ గోరి
పలుకఁడు కాఠిన్యభాషణములు
తలఁపఁ డించక యైన ధనకాంక్ష నేనాఁడు
బంధుమిత్ర్రాశ్రిత ప్రతతిఁ జెఱుప

తే. సతతగాంభీర్యధైర్యభూషణపరుండు
వార్తకెక్కిన రాజన్యవర్తనుండు

సకలభూపాలజనసభాసన్నుతుండు ధర్మతాత్పర్యనిరతుండు దశరథుండు. 21

సీ. విరహాతిశయమున వృద్ధిఁ బొందఁగ లేక విషధరుండును గోఱ విషయముఁ బూనె తాపంబు క్రొవ్వెంచి తరియింప నోపక పలుమాఱుఁ గడగండ్లఁ బడియెఁ గరులు కందర్పశరవృష్టి నంద నోపక ఘృష్టి వనవాసమునఁ గ్రుస్సి వనరు సూపె దీపించి వల పాఁప నోపక కూర్మంబు కుక్షిలోపలఁ దలఁ గ్రుక్కి కొనియె

తే. కుంభినీకాంత తమమీఁదికూర్మివిడిచి ప్రకటరాజ్యమస్తకాభరణముకుట చారుమాణిక్యదీపితచరణుఁడైన దశరథాధీశుభుజపీఠిఁ దగిలినంత. 22

క. ఆరాజు రాజ్యమందలి వారెల్లను నిరతధర్మవర్తను లగుచున్ భూరిశ్రీవిభవంబుల దారిద్ర్యం బెఱుఁగ రెట్టితఱి నేనాఁడున్. 23

వ. ఇట్టిమహాధైర్యసంపన్నుంటును మహైశ్వర్యధుర్యుండును నగుదశరథమహారాజు సకలసామంత రాజలోకపూజ్యమానుం డగుచుఁ బ్రాజ్యం బగురాజ్యంబు నేలుచు నొక్కనాడు.

సీ. సంతానలబ్ధికై చింతించి చింతించి శిష్టవర్తనుఁ డౌవసిష్ఠుఁ జూచి తనకోర్కి వినుపింప విని మునిసింహుండు వలికె ఋశ్యగృంగు నెలమిఁ దేర సకలభూపాలజనసభాసన్నుతుండు ధర్మతాత్పర్యనిరతుండు దశరథుండు. 21

సీ. విరహాతిశయమున వృద్ధిఁబొందఁగ లేక

 విషధరుండును గోఱ విషయముఁ బూనె

తాపంబు క్రొవ్వెంచి తరియింప నోపక

 పలుమాఱుఁ గడగండ్లఁ బడియెఁ గరులు

కందర్పశరవృష్టి నంద నోపక ఘృష్టి

 వనవాసమునఁ గ్రుస్సి వనరు సూపె

దీపించి వల పాఁప నోపక కూర్మంబు

 కుక్షిలోపలఁ దలఁ గ్రుక్కి కొనియె

తే. కుంభినీకాంత తమమీఁదికూర్మివిడిచి ప్రకటరాజ్యమస్తకాభరణముకుట చారుమాణిక్యదీపితచరణుఁడైన దశరథాధీశుభుజపీఠిఁ దగిలినంత. 22

క. ఆరాజు రాజ్యమందలి వారెల్లను నిరతధర్మవర్తను లగుచున్ భూరిశ్రీవిభవంబుల దారిద్ర్యం బెఱుఁగ రెట్టితఱి నేనాఁడున్. 23

వ. ఇట్టిమహాధైర్యసంపన్నుంటును మహైశ్వర్యధుర్యుండును నగుదశరథమహారాజు సకలసామంత రాజలోకపూజ్యమానుం డగుచుఁ బ్రాజ్యం బగురాజ్యంబు నేలుచు నొక్కనాడు

సీ. సంతానలబ్ధికై చింతించి చింతించి

 శిష్టవర్తనుఁ డౌవసిష్ఠుఁ జూచి

తనకోర్కి వినుపింప విని మునిసింహుండు

 వలికె ఋశ్యగృంగు నెలమిఁ దేర 

తే. వనరు గలిగెను మనకు రావణునిఁ జంప వినుఁడు మీ రెల్ల నామాట వేడ్కమీఱ దశరథుం డనురాజు సంతాన కాంక్ష నొనర జన్నంబు గావించుచున్నవాఁడు 32

క. ధరణీపతి యగుదశరథ నరానాయకునింటఁ బుట్టి నరరూపమునన్ బెరిఁగెద నేనిఁక మీరును నురకంటకుమీఁద లావు సూపుటకొఱకై 33

క. కొందఱు కపివంశంబునఁ గొందఱు భల్లుకకులమున గురుబలయుతులై యందఱు నన్ని తెఱంగుల బృందారకులార పుట్టి పెరుఁగుఁడు భువిపై 34

వ. అని కృపాధురీణుం డైన నారాయణుఁ డానతిచ్చిన విని వన జాసనాదిదేవతానికరం బవ్వనజోదరునిపాదారవిందమ్ములకు నందనమ్ము లాచరించి నిజనివాసమ్ములకుం జని య్యవస రమ్మున. 35

మ. ఇల పాకేతనృపాల శేఖరుఁడు ద హైలావిలాసంబుతో ఫలకాంక్షన్ గ్రతువుం బొర్చిన యెడన్ బంగారు పాత్రమ్ములో పల దుగ్ధాన్నము చాలనించుకొని తాఁబ్రత్యక్షమై నిల్చి ని ర్మల తేజంబునఁ బావకుండనియెఁ బ్రేనున్ మంజువాక్యంబులన్. 36

క. భూపాల నీదుభార్యల కీపాయస మారగింప నిమ్మీ తనయుల్ శ్రీపతిపుత్త్రసమానులు రూపసు లుదయింతు రమితరూపస్ఫూర్తిన్ 37

వ. అని చెప్పి యప్పాయస పాత్రంబు చేతి కిచ్చిన. 38


ఆ. పాయసమ్ము రెండుభాగముల్ గావించి
యగ్రసతుల కీయ నందులోన
సగము సగము దీసి ముగుద సుమిత్రకు
నొసంగి రంత నామె మెసవెఁ బ్రీతి 39

వ. అంతం గొన్నిదినంబులకుఁ గౌసల్యకైకేయీసుమిత్రలు
గర్భవతు లై యొప్పాఱుచుండ. 40

సీ. ధవలాక్షు లనుమాట తథ్యంబు గావింపఁ
  దెలు పెక్కి కన్నులు తేట లయ్యె
నీలకుంతల లని నెగడినయామాట
  నిలుపంగ నెఱులపై నలుపు నూపె
గురుకుచ లనుమాట సరవి భాషింపంగఁ
  దోర మై కుచముల నీరువట్టె*
మంజుభాషిణు లనుమాట దప్పక యుండ
  మొలఁతలపలుకులు మృదువు లయ్యెఁ

తే. గామిను లటంట నిక్కమై కాంతలందుః
మీఱి మేలైనరుచులపైఁ గోరి కయ్యె
సవతిపో రనఁ దమలోన సారె సారె
కోకిలింతలు బెట్టుచిట్టుములుఁ బుట్టె 41

వ. మఱియును. 42

సీ. తనుమధ్య లనుమాటఁ దప్పింపఁ గాఁబోలుఁ
  బొఱలేక నుడుములు పొదలఁ జొచ్చెఁ


శ్రీ. కం. వీరేశలింగముపంతులవారి ప్రతిలోని పాఠములు.

  • మందయాన లనంగ మా నైనయమ్మాట

      నిక్కంబుగా మాంద్యమెక్కెనడల.

గుచములు బంగారుకుండలో యనుమాట
కల్లగా నగ్రముల్ నల్లనయ్యెఁ *
జంద్రాస్య లనుమాట సరవి మాన్పఁగఁ బోలు
గళలవిలాసమ్ము పలుచ నయ్యె
సుందరు లనుమాట సందియమ్ముగఁ బోలు
గర్భ భారమ్ములఁ గాంతి దప్పె
తే. ననుచు గనుకొన్నవా రెల్ల నాడుచుండఁ
గట్టుచీరెల వ్రేకంబు పుట్టుచుండ
నానతుల జూచి యందఱు నలరుచుండఁ
గాంతలకు నప్డు గర్భముల్ గానుపించె.
వ. ఇట్లు దుర్భరంబు లైన గర్భంబులు దాల్చిన కేసల్యాదికాఁ
తాత్రయమ్మును జైత్రమాసమ్మున శుక్లపక్షమ్మున నవమీ
భానువారమ్మునఁ బునర్వసునక్షత్రమ్మునఁ గర్కటకలగ్నం
బున శ్రీ రామభరతలక్ష్మణ శత్రుఘ్నులం గాంచినం దదనం
తరంబున దశరధుండు యధోచితక ర్తవ్యంబులు జరిపి యప్పది
దినంబులు నరిష్టంబు లేక ప్రతిదినప్రవర్ధమాన మగుచున్న
కుమారచతుష్టయంబునకుఁ గాలోచితంబు లగుచౌలోపన
యనాదికృత్యంబులు గావించి వెండియ విద్యాప్రవీణు లగు
నట్టు లొనర్చి గజాశ్వరధారోహణంబులు నేర్పి ధనుర్వేద
సారంబులం గావించి పెంచుచున్న సమయమ్మున.
సీ. ఒక నాడు శుభగోష్టి నుర్వీశ్వరుఁడు మంత్రి
హితపురోహితులం నెలమిఁ జేరి
బంధువర్గము రాయబారులుఁ జారులుఁ
బరిచారకులు నెల్ల సరవిఁ జేరి

  • ముకురక పోలలు ముగుద లనెడు మాట, కల్లగా జెక్కులు వెల్లనయ్యె.



గాయకులుమను భృత్యగణములు మిత్తురులు
 సతులు సుతులును జక్క నలరి
సరసులు జతురులుఁ బరిహాసకులుఁ గళా
వంతులుఁ గడు నొక్క వంకఁ జేరి
తే. కొలువఁ గొలువున్న ఎడ వచ్చి కుశికపుత్త్రుఁ
డర్ధి దీవించి తావచ్చినట్టి కార్య
మధిపునకుఁ జెప్ప మదిలోన నాత్రపడచు
వినయ మొప్పార నిట్లని విన్నవించె |45|
శ. రాముడు దనుజులతో సం
గ్రమము సేయంగ గలదె కందుగదా ! నే
నే మిమ్ము గొలిచి వచ్చెద
నో ముని రాజేంద్ర ! యరగు ముచిత ప్రౌఢిన |46|
మ. అనినం గౌశికు డాత్మ నవ్వి వినుమయ్యా రాజ ! నేచేతఁగా
దనరా దైనను రాక్షసుల్ విపులగ ర్వాటోప బాహాబలుల్
ఘనుఁ డీ రాముఁడుదక్క వారిఁ గెలువంగా రాదు పిన్నంచు నీ
వనుమానింపక పంపు మింకఁ గ్రతురక్షణార్ధంబు భూనాయక |47|

వ. అని ప్రి యోక్తులు పలుకుచున్న విశ్వా మిత్రునకు మిత్రకుల పవిత్రుండైన దశరధుండు మా ఱాడ నోడి యప్పుడు. |48|




క. మునినాధువెంట సుత్రా
ముని నలజడి వెట్టుచున్న మూర్ఖులపై రా
ముని సౌమిత్రిని వెస న
మ్మునితో నానందవార్ధి మునుఁగుచుఁ బనిచెన్. |49|
మత్తకోకిలము.
వారిఁ దోడ్కొని కౌశికుం డట వచ్చునయ్యెడ ఘోర కాయ
తారమధ్యమునందు నొక్కతె దైత్యకామిని భీకరా

కార మొప్పఁగ నఅహాసవికాస మేర్పడ రాఁగనా
క్రూరరాక్షసిఁ జూచి యమ్మునికుంజరుం డొగి రామునిన్.
క. తాటక వచ్చిన దదిగో
నాటక నాఁడు దని మేల మాడక నీ వీ
పాటి పడ నేయు మని తన
చాటున భయపడిరామచంద్రున కనియన్. |51|
వ. ఇట్లు చెప్పిన యీ మునిచంద్రుని పల్కు లాలించి రామచం
ద్రుండు తనయంతరంగమ్మున నిట్లని వితర్కించె. |52|
క.ఈయాఁడుదానిఁ జంపఁగ
నా యమ్మున కేమి సగరె వీరుల్
చీ యని రోయుచు నమ్ముని
నాయకుభయ మెఱిఁగి తనమమ్మున నలుకన్. |53|
క. వ్రేటు గొని రామచంద్రుఁడు
సూటిగ నొకదిట్టకోల సురల్ నుతింపన్
ఘోటక సమ వక్షస్థలఁ
దాటక నత్య్గ్రలీల ధరపైఁ గూల్చెన్. |54|
వ. ఇట్లు దాటకం గీటణంచినయంత నమ్మునీంద్రుడు మేటి
సంతోషమ్మున రామునిం గొనియాడుచు నశ్రమంబుగ
నిజాశ్రమంబున కేతెంచి రామసౌమిత్రులనాయంబున
జన్నంబు సేయుచున్న సమయంబున. |55|
క.ఆకాశవీధి నెలకొని
రాకాసులు గురిసి రమితర క్తముఁ బలలం
బాకౌశికుయజ్ఞముపై
భీకరముగ మునిగణంబు భీతిం బొందన్. |56|

ఉ.అంబరవీధి నిల్చి త్రిదశాంతకు లెంతయు నేచి రక్తమాం
సంబులు గాధినందనునిజన్నముపైఁ గురియంగ నంతలో
నంబరరత్నవంశకలశాంబుధిచంద్రుడు రామచంద్రుఁడు
గ్రంబుగఁ ద్రుంచెఁజండబలగర్వలదమ్ముఁడుఁదానునొక్కటై.
వ.ఇట్లు రామచంద్రుండు సాంద్రవ్రతాసంబు మించ నిం
ద్రాదులఁ ద్రుంచిన నమ్మునుచంద్రుఁడు నిర్వుఘ్నంబుగా
జన్నం బొనర్చి రామసౌమిత్రులం బూజించె నట్టి సమయ
మ్మున. |58|
క. ధరణీసుత యగుసీతకుఁ
బరిణయ మొనరింప జనకపార్ధువుఁ డిల భూ
వరసుతల రండని స్వయం
వర మొగిఁ జాటించె నెల్లవారలు వినఁగన్, |59|
వ.ఇట్లు స్వయంవరమహోత్సవఘోషంబున సంతోషంబునకుఁ
దోడ్కొని చనుచుండు మార్గంబున. |60|
క.ముది తాపసి వెనువెంటను
వదలక చనుదెంచినట్టి వడి రామునిశ్రీ
పదరజము సోఁకి చిత్రం
బొదవఁగఁ గనుబట్టె నెదుట నొకయుపల మటన్. |61|
క.పద నైయొప్పిద మై కడుఁ
గదలుచు బంగారుపూదె కరఁగినరీతిన్
బొదలుచు లావణ్యస్థితి
సుదతిగఁ జూపట్టి నిలిచె సురుచిరలీలన్. |62|
ఉ. ఆమునివల్లభుండు గొనియాడుచు బాడుచు వేడ్కతోడ శ్రీ
రామునిఁ జూచి యిట్లనియె రామ ! భవత్పదధూళిసోకియీ
 

భామిని రాయి మున్ను కులపావన చూడగఁ జిత్రమయ్యెనీ
నామమెఱుంగు వారలకుసమ్మఁగవచ్చునుభు క్తిముక్తులున్.
వ. అని యక్కాంతారత్నంబు పూర్వవృత్తాంతం బంతయు
నెంతయు సంతసమ్మున నమ్మనుజేంద్రనందనుల కెఱింగింపుచు
మిథిలానగరంబునకుం జనియె నచ్చట.
సీ.ద్రవిడ కర్ణాటాంధ్ర యవన మహారాష్ట్ర
రాజకుమారులు తేజ మలరఁ
బాండ్య ఘూర్జర లాట బర్నర మళయాళ
భూపనందనులు విస్పూర్తి మీఱ
గౌళ కేరళ సింధు కాశ కోసల సాళ్వ
ధరణీ పుత్రులు సిరి వెలుంగ
మగధ మత్స్య కళింగ మాళవ నేపాళ
నృపతనూభవులు నెన్నికకు నెక్క
తే.మఱియు నుత్కల కోంకణ మద్ర పౌండ్ర
వత్స గాంధార సౌరాష్ట్ర వంగ చోళ
రాజ్యముల నొప్పుఛప్పన్న రాజసుతులు
వచ్చి రక్కామినీస్వయంవరమునకును. |65|
ఉ.కొందఱు పల్లకీల మఱికొందఱు తేరుల నందలంబులన్
గొందఱు కొందఱశ్వములఁ గొందఱుమ త్తగజేంద్రసంఘము
న్గొందఱు స్వర్గడోలికల గోరిక నెక్కి నృపాలనందనుల్
సందడి గాగ వచ్చిరి బుజంబు బుజంబును ద్రోవులాడగన్.
వ. అట్టి సమయంబున. |60|
చ.గురుభుజశక్తి గల్గుపదికోట్లజనంబుల బంప వారు నా
హరునిశరాసనంబుగొనియాడుచు బాడుచుగొంచువచ్చిసు

బాల కాండము
స్థిరముగ వేదిమధ్యమునఁ జేర్చిన దానికి ధూపదీపముల్
విరులును గంధ మక్షతలు వేడుక నిచ్చిరి చూడనొప్పగన్.
వ.అట్టి సమయంబున జనకభూపాలుండు రాజకుమారులం
గనుంగొని ఇట్లనియె. |69|
ఉ.కొంకక సావధానమతిఁ గూర్చి వినుం డిదె మత్కుమారికై
యంకువ సేసినాఁడ వివిధోజ్వల మైనధనంబుఁ గాన నీ
శంకరు చాప మెక్కిడిన స్త్త్వఘనుండగువాని కిత్తు నీ
పంకజనేత్ర సీత నరపాలకులార నిజంబు సెప్పితిన్. |70|
ఆ.అనుచుబలుకుచున్న అవనీశతిలకుని
వాక్యములకు నుబ్బి వసుమతీశ
నుతులు దాముదామె మతిలోనఁ జెలఁగుచు
దగ్గఱంగఁ బోయి ధనువు జూచి. |71|
క.విల్లా ఇది కొండా యని
తల్లడపడి సంశయంబు తలకొన మదిలో
బల్లిదు లగునృపనందను
లెల్లరు దౌదల నుండి రెంతయు భీతిన్. |72|
క.కొందఱు డగ్గర నోడిరి
కొందరు సాహసము చేసి కోదండముతో
నందంద పెనగి పాఱిరి
సందుల గొందులను దూరి సత్వము లేమిన్. |73|
సీ. గాలిఁ దూలినరీతిగా నెత్తఁ జాలక
తముఁ దామె సిగ్గున దలను వంచి
కౌఁగిలించిన లోను గాక వెగ్గల మైన
భీతిచే మిక్కిలి భీరువోయి

  

 

కరముల నందంద పొరలించి చూచినఁ
గదలక యున్నఁ జీకాకునొంది
బాషాణ మున్నట్టిపగిది మార్దబవ మేమి
కాన రాకుండిసఁ గళవళించి |74|
తే.రాజసూనులు కొందఱు తేజ ముడిగి
జగతి రాజుల మోసపుచ్చంగఁ దలఁచి
జనకుఁ డీమాయఁ గావించె జాలు ననుచుఁ
దలఁగి పోయిరి దవ్వుగా ధనువు విడిచి .|75|
సీ. ఇది పర్వతాకార మీవిల్లు కను విచ్చి
తేఱి చూడఁగ రాదు దేవతలకు
నటుగాక మును శేషకటకునిధను పంట
హరుఁడె కావలెఁ గాక హరియుఁ గాక
తక్కినవారికిఁ దరమె యీకోదండ
మెత్తంగఁ దగుచేవ యెట్లు గలుగు
దీని డగ్గఱ నేల దీని కోడఁగ నేల
పరులచే నవ్వులు పడఁగ నేల |76|
తే.గురుతు సేసియుఁ దమలావుకొలదిఁ దామె
తెలియవలెఁ గాక యూరక తివురనేల
యొరుల సొమ్ములు తమ కేల దొరకు ననుచుఁ
దలఁగి పోయిరి రాజ నందనులు గనుచు.
వ.అంత విశ్వామిత్ర మునీంద్రుడు రామచంద్ర ముఖావలో
కనంబుఁ జేసిన. |77|
చ.కదలకుమీ ధరాతలమ కాశ్యపిఁ బట్టు ఫణీంద్ర భూవిషా
స్పదులను బట్టు కూర్మమ దసాతలభోగిఢులీకులీశులన్

<poem>

వదలక పట్టు ఘృష్టి ధరణీఫణిచ్ఛపపోత్రి వర్గమున్ బొదవుచు బట్టుఁడీ కరులు భూవరుఁ డీశునిచాపమెక్కిడున్. క.ఉర్వీనందనకై రా మోర్వీపతి యెత్తు నిప్పు డుగ్రుని చాపం బుర్విం బట్టుఁడు దిగ్ధం త్యుర్వీధరకిటిఫణీంద్రు లూఁతఁగఁ గడిమిన్. |78| వ.అనిచు లక్ష్మణుండు దెలుపుచున్న సమయంబున. |79| మ. ఇనవంశో ద్భవుఁడైన రాఘవుడు భూమీశాత్మ జుల్ వేడ్క తోఁ, దను వీక్షింప మునీశ్వరుం డలరఁ గోదండంబుచే నందించి, వ్వన మోపెట్టి గుణంబు పట్టి పటుబాహాశక్తితోఁ దీసినన్, దునిఁగెన్ జాపము భూరిఘోషమున వార్ధుల్ మ్రోయుచందమునన్. |80| తే.ధనువు దునిమినంత ధరణీశసూనులు శిరములెల్ల నుంచి సిగ్గు పడిరి సీత మేను వెంచె శ్రీరామచంద్రునిఁ బొగడె వపుడు జనకభూవిభుండు. |81| ఇట్లు శ్రీరామచంద్రునిస త్త్వసంపదకు మెచ్చి సంతోషించి జనకమహారాజు వివాహంబు సేయువాఁడై రమ్మని ధశరధే శ్వరుని పేరిట శుభలేఖలు వ్రాయించి పంచిన ధశరధమహారా జునునాశుభ లేఖలంజదివించి సంతోషంబున నానందభాష్పం బులు గ్రమ్ముదేవర మంత్రి ప్రవరుండగుసుమంత్రునింబిలిపించి సుమంత్రా ! యిపుడు మన మందఱమును బయలుదేఱి మిధి లాపట్టణంబునకుం బోయి యట జనకమహారాజునింట మన రామలక్ష్మణభరతశత్రుఘ్నులకు వివాహమహోత్సవము జరుప ---

  • 'జవ్రాతముల్' అని పాఠాంతరము.

<poem>

వలయుఁ గావున వసిష్ఠాదిద్విజవర్యులను గౌసల్యాదికాంతా
జనమ్మును నరుంధతి మొదలుగాఁగల భూసురభార్యలను మఱి
యు సకలబంధుజనంబును రావించి బంగరుటరదంబుల
నిడికొని దోడ్కొని రమ్మనియంపిన నతండును మహాప్రసాదం
బని తత్‌క్షణమ యంతఃపురంబునకుం బోయి కౌసల్య
కైకసుమిత్ర మొదలగు రాజకాంతలను వసిష్ఠాదిద్విజనరిష్ఠు
లను నరుంధతి మొదలుగాఁ గలము త్తైదువలను మిగిలినసకల
బంధుజనమ్మును రావించి యుక్తప్రకారమ్ముగాఁ గనకరధమ్ము
లపై నిడుకొని దశరధమహారాజుకడకుం గొనివచ్చిన యంత
దశరధుండు పుత్రధ్వయసహితమ్ముగరధమారోహించి సమస్త
సేనాసమన్వితుం డగుచు వాద్యఘోషంబులు దశదిశలు
నిండ నడచుచున్న సమయమ్మున్ నంతకు ముందు జనకభూ
వల్లభుండు దశరధమహీపాలు నెదుర్కొని తోడితెచ్చి
యడుగుల్ గడిగి యర్ఘ్యపాద్యాధివిధుల విద్యుక్తంబుగాఁ
బూజించి మానితంబుగఁ గానుక లొసంగి సకలసంప
త్సంపూర్ణ మయినవిశేషముం గల్పించి యసందుఁ బెండ్లి
వారిని విడియించె నంత నక్కడఁ గనకవికారమైనపీఠమ్ముపైఁ
గూర్చున్నసమయమ్మున దేవా ! శుభముహూర్తం బాసన్న
మగుచున్నది రమ్మని వశిష్ఠుండు సనుదేర నాతఁడు సని రామ
లక్ష్మణభరతశత్రుజ్ఞులకు మంగళస్నానమ్ముఁ జేయించి
నిర్మలాంభరణంబు లొసగి వేర్వేఱ నొక్క ముహూ
ర్తమ్మునఁ దనకూతు సీతను శ్రీ రామచంద్రునకున్ దన తమ్ముడు కుశధ్వజుని కూఁతు లగు మాండవ్యూర్మిళాశ్రుత
కీర్తులను భరతలక్ష్మణశత్రుజ్ఞులకును నిచ్చి వివాహముం
జేసి తనప్రియతనయల కొక్కకఱెకు నూఱేసి భద్రగజ

మ్ములను వేయేసితురంగబులను బదివేలు దాసీజనమ్మును
లక్షధేనువులును వరణంబు లిచ్చి దశరధాదిరాజలోకమ్ము
నకు బహుమానమ్ముగా నవరత్నఖచితభూషణమ్ములును జీని
చీనాంబరమ్ములును నొసంగి సుగంధద్రవ్యమ్ముల నర్పించి
పూజించి యంపె నంత దశరధమహారాజు మరలి యయో
ధ్యాపట్టణంబునకు వచ్చుచుండఁగా మధ్యేమార్గంబున. |82|
ఆ.పరశురాముఁ డడ్డుపడి వచ్చి మీనామ
మెవ్వ రనిన మొలకనవ్వుతోడ
నేను దశరధుండ నితఁడు నా పుత్రుడు
రాముఁ డండ్రు పేరు భీమబలుఁడు. |83|
వ. ఆని వినిపించినఁ గ్రోధావేశవశంవందు డై యప్పు డప్పు
రశురాముండు రాముం గనుంగొని యిట్లనియె.
క.రాముఁడు నేనై యుండగ
నామీఁద నొకండు గలిగెనా మఱి యౌఁ గా
కేమాయె రణ మొనర్పఁగ
రామా రారమ్మటంచు రహిఁ బిలిచెఁ దగన్.
వ. పిలిచినతో డనే రామచంద్రుం డతని కిట్లనియె.
ఆ. బ్రాహ్మణుండ నందుఁ బరమపవిత్రుండ
వదియుఁగాక భార్గవాస్వయుండ
వైననిన్నుఁ దొడిరి యాహనస్థలమున
జగడ మాడనాకుఁ దగునె చెపుమ.
వ.అనిన విని పరశురాముం డిట్లనియె.
ఉ.శస్త్రముఁ దాల్చినం దగునె సన్నుతికెక్కినబ్రాహ్మణుండనన్
శాస్త్రము గాదు నాకెదిరి సంగరభూమిని నిల్చినంతనే

శాస్త్రముఖంబులన్ నృపులఁజక్కుగఁజేయుదుఁగాననిప్పుడున్
శస్త్రముశాస్త్రముంగలవుసాహసవృత్తినిరమ్ముపోరగన్. |89|
వ.అనిన రామచంద్రుండిట్లనియె. |90|
మ.విను మావంటినృపాలురైనఁ గలనన్ వీరత్వముంజూపఁగా
ననయౌఁగాకమహానుభావుఁడవు నిన్నాలంబులో మీఱఁగా
నెనయున్ ధర్మువె మాకుఁ జూడమఱినీవేమన్ననీమాటకుం
గలనన్ మంచిదికాదు మా శెవుడుదోర్గర్వంబుమీ పట్టునన్.|91|
స.అనిన విని యెంతయు సంతోషించి భార్గరాముం డారఘు
రామునితో నిట్లనియె. |92|
ఆ.శివునిజివుకువిల్లు శీఘ్రంబె యానాఁడు
విఱిచినాఁడ ననుచు విఱ్ఱవీఁగ
నలదు నేఁడు నాకు వశ మైనయీచాప
మెక్కు పెట్టితియు మింతెచాలు. |93|
ఉ.రాముఁడు గీముఁ డంచును ధరాజనులెల్ల నుతింప దిట్టవై
భీమునిచాపమున్ విఱిచి వ్రేలెద వందుల కేమిగాని యీ
శ్రీమహి ళేశుకార్ముకముఁ జేకొని యెక్కిడుదేని నేఁడు నీ
తో మఱీ పోరు సల్పి పడఁ ద్రోతు రణస్థలి నీశరీరమున్.|94|
చ.అని తనచేతివిల్లు నృపులందఱుఁ జూడఁగ నందియీయ నా
ధనువును గూడితేజముఁ బ్రతాపము రామునిఁజెందెనంతనే
జనవరుఁ డాశరాసనముఁ జక్కఁగ నెక్కిడి వాఁడిబాణ మం
దుననిడియేదిలక్ష్యమనఁద్రోవలుసూపినఁద్రుంచెగ్రక్కునన్. |95|
చ.ఇట్లు మహాప్రతాపంబునఁ దాపలు ద్రుంచి యనర్గళప్రతాప
మ్మున భార్గవరాముదోద్గర్వంబు నిర్గర్వంబు గావించి జయ
మ్ముఁ గైకొన్నకుమారునిం గౌఁగిలించుకొని దశరధుండు
 

కుమారచతుష్టయమ్ముతో నయోధ్యానగరంబుఁ బ్రవేశించి
సుఖోన్నతి రాజ్యంబు నేలుచున్నసమయంబున. |122|
శా.పారావారగభీరికిన్ ద్యుతిలసత్పద్మారకిన్ నిత్యవి
స్తారోదాగవిహారికిన్ సుజనరక్షాదక్షాదక్షారికిన్
సారాచారవిచారికిన్ మదిరిపుక్ష్మాపాలసంహారికిన్
వీరా సాటి నృపాలకుల్ దశరథోర్వీనాథజంబారికిన్.|123|
వ.అని కొనియాడఁ దగిననృపాలశేఖరుండు ధర్మమార్గంబు
నొక్కింతయేనిఁ దప్పకుండ రాజ్యంబు సేయుచుండె ననుట
విని నారదుని వాల్మీకి మునీశ్వరుం డటమీఁదికథా
విధానం బెట్టి దని యడుఁగుటయు.|124|
క.జలజాక్ష ! భక్తవత్సల !
జలజాసనవునుతపాదజలజాత ! సుధా
జలరాశిభవ్యమందిర !
జలజాకరచారుహంస ! జానకీనాథా. |125|
గద్యము. ఇది శ్రీగౌరీశ్వరవరప్రసాదలబ్ధ గురుజం గమార్చన
వినోద సూరిజనవినుతాచమత్కారా తుకూరి కేనన
సెట్టితనయ మొల్లనామధేయవిరచితం బైన శ్రీరామా
యణమహాకావ్యంబునందు బాలకాండము సర్వము నేకా
శ్వానము.