Jump to content

పోరే మీ ఇండ్లకు ప్రొద్దున లేచి

వికీసోర్స్ నుండి
(పోరే మీ యిండ్లకు ప్రొద్దున లేచి నుండి మళ్ళించబడింది)


పోరే మీ ఇండ్లకు (రాగం: వరాళి) (తాళం : చాపు)

వరాళి రాగం, చాపు తాళం

పల్లవి:

పోరే మీ ఇండ్లకు ప్రొద్దున లేచి

రారే రాముని కొల్వుకు

అనుపల్లవి:

పోరే ప్రొద్దుపొయే పడతులార రఘు

వీరుని కధలెల్ల వినరేపొద్దురుగాని

చరణాలు: పదునాల్గు భువనాలు పరిపాలన చేసి

నిదురలేక బడలి నిద్రించియున్నాడు

సుందారాకారుడు సుస్తీ చెందీనాడు

సందాడీ కూడదు ఇందువదనాలారా

నీల వర్ణుడు మల్లేపూలా పానుపు మీదా

ప్రాలుమాలిక చేత పవళించియున్నడు

భక్తవరులు గూడి పదములు పాడంగా

పంకజనాభుండు పవళించియున్నాడు

ఆంతర్యమున మోహభ్రాంతిచెంది సీతా

కాంతను గూడీ ఏకాంతమందున్నాడు

కోరికలర తోమునరశిమ్హుని ఇంట

జేరీ రాముడు శేషశయనుడైయున్నాడు.

అభిప్రాయం