పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

211 దేవత్వము

డగును. భగవత్ప్రేమరస మార్యసాహిత్యమున కావలసినంత కలదు. హోమర్, వర్జిల్, డాంటే, మిల్టన్ మొదలగు కవులు తమకావ్యములయందు భగవదవతారములు రచింపనే లేదు, వాటిని చదువుటవల్ల దైవభక్తిప్రభావమే యెరుకపడదు; భగవంతునిప్రభావజ్ఞానమే కలుగదు. బ్రహ్మజ్ఞానము మన వేదములం దుండినట్లు విదేశగ్రంథములయందు కానరాదు, వైదికజ్ఞానము కొంచెము ప్రసరించిన దేశములయందుకూడా అది రూఢము కాలేదు, కావున ఇతరదేశీయులకు బ్రహ్మజ్ఞానము ప్రాప్తించలేదు. కావ్యసృష్టికి కావలసిన సాధనసంచయము మన వేద వేదాంతములందు విపులముగా నుంది. వేదములన్నీ దివ్యుల విపుల రాష్ట్ర మనవచ్చును, దివ్యసుందర కాంతి అం దుజ్వలరూపమున భాసిల్లుచున్నది; వేదాంతము (ఉపనిషత్తు) లందు దేవతలూ లేరు, స్వర్గమూ కానరాదు, అందు నిర్మలము పవిత్రము నగు చైతన్యమూర్తి భాసిల్లుతూ ఉండును. వేదములు కర్మప్రధానములు, వాటి ఫలము స్వర్గప్రాప్తి; వేదాంతములు జ్ఞానప్రధానములు, వాటి పరిణామము ముక్తి.

ఋషి చరితము

ఆర్యసాహిత్యమున వెలయు దేవతాదర్శములు మానవులకు సిద్ధించునా? మానవుల కవి అప్రాప్యములని ఏసుక్రీస్తు అభిప్రాయము, కాని వైదికార్యు లని ప్రాప్యములనే చెప్పిరి; మానవులందు దేవత లంతహిన్‌తులై యున్నారనీ, బాహ్యా