పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210 సాహిత్య మీమాంస

ఒకప్పు డదే జగన్మోహనమగు శ్రీకృష్ణరూపమున గోపికలను భక్తుల తృప్తినొందించుచుండును, అన్నపూర్ణరూపమున విశ్వాత్మ ప్రేమను జీవరాసులకు పంచిచ్చును. ఇట్టి అనంతకరుణామయమగు రూపము ఆర్యసాహిత్యమున శ్రీరామ కృష్ణావతారములదాల్చి విలసిల్లుచున్నది. ఇతరసాహిత్యములందు ఇట్టి భగవదవతారములే కానరావు. చిత్తవశీకరణములగు నవతారములు భగవంతుని అలౌకికవ్యాపారములు. భీతిగాంభీర్యములు మానవచిత్తములయందు భాసమానమగు నట్లు అలౌకికశక్తివంతుడగు భగవంతుడు పృథ్వి కవతరించి మానవులతోపాటు వ్యవహరించెనని విదేశసాహిత్యమున నెచ్చటా చెప్పబడలేదు. ప్రేమమయుడగు పరమాత్ముడు లోకసంగ్రహార్థముపృథ్వీ నవతరించి ఎట్టికార్యముల నాచరించుచుండునో మన మెరుగలేము. పాపులను శిక్షించి పాప నివారణ మొనర్చి, పుణ్యాత్ములకు దర్శనమిచ్చి వారిని స్వర్గమునకు కొనిపోవునని మనగ్రంథములం దున్నది. మానసమున భావించిన యీ ఉదాహరణములు కావ్యములయందు ప్రత్యక్షమగును.

ప్రపంచపరిపాలనానియమములను గని నివ్వెరపడ నివారుండరు. అట్టి యాదర్శముల నభివర్ణించిన కావ్యములు సఫలములు కావా? ఈవర్ణనలందు కల్పనాశక్తికి కావలసినంత అవకాశము లభించును. భగవంతుని అద్భుతలీలలూ అపురూపక్రియాకలాపమున్నూ గాంచినతోడనేమానవుడు చకితు