పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

205 దేవత్వము

లంబనము. ఇది నిర్వహించు తెరం గీవిధమున మహాభారత మం దున్నది : _

                 తత్ర వై మానుషాల్లోకా ద్దానాదిభి రతంద్రిత:
                 అహింసార్థ సమాయుకై: కారణై: స్వర్గమశ్నుతే||
                 దా నాదుల పూనికతో నేనరు డర్థార్థియై యహింసా యుక్తిన్
                 తా నభ్యసించుచుండును, వానికి దేవత్వ మొగిని వశమౌ నిలలోన్||

దానధర్మము లభ్యసించుటవల్ల అక్రోధము, క్షమా అలవడి హింసాప్రవృత్తి హీనమగును. సామాన్యప్రేమ ప్రసారమున అహింస యావహిల్లదు. ఇతరునిసుఖము చూచి తాను సుఖించడమే ప్రేమ. హింస స్వసుఖాభిలాషిణి - ప్రేమ పరసుఖాభిలాషిణి - ప్రేమలోక ప్రసార మతిశయించినకొద్ది హింసాధకారప్రసారము సంకుచిత మగును. ప్రేమ పొంగి వెల్లివిరిసి విశ్వవ్యాపిని కాగా సమదృష్టి యవతరించి హింసా పరత్వమును సమయించును. ఇట్టి సమత్వము మైత్రేయికి లభించినతోడనే "సంసారమందు నీకు ప్రేమ కల్గినంతమాత్రమున నది నీకు ప్రేమపాత్రమని యెంచకు, ఆత్మ నీ కత్యంత ప్రీతిపాత్రమగుటచేతనే సంసారము ప్రేమాస్పదమయ్యెను." అని యాజ్ఞవల్క్యు డామె కుపదేశించెను. తోడనే వారు సంసారమును త్యజించి వనములందు వసింపనేగిరి, స్వర్గము వారికి కరగతమౌటచేత ఈలోకమునుండియే వారు ముక్తులైరి, బ్రహ్మప్రాప్తికై సన్యాసమార్గము నవలంబింపవలసి వచ్చెను.