పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204 సాహిత్య మీమాంస

సొత్తంతా తన అధీనము చేసుకొనెను. యూదులు క్రైస్తవ న్యాయస్థానముల కెక్కినందులకు లభించే ఫలము చూడండి!

పోర్షియానోట వెలువడిన దయా వాక్యములు మూడు కారణములచేత పొల్లువోయెను : _

1. క్షమాచిత్రము మనసు కెక్కునట్లు కవి చిత్రింప లేదు.

2. షైలాకుపక్షమున చెప్పవలసిన విషయములు స్ఫురణకు వచ్చును.

3. విచారణానంతరముకూడా షైలాకునెడ క్రైస్తవులు నిర్దయచూపుదురు.

క్షమాగుణమును వృద్ధిచేయడము కవిఉద్దేశ్యముకానే కాదు, మానవుడు ఒకరిని వంచింపబోయి త్రవ్విన గోతిలో తానే పడునని నిదర్శనము చూపదలచినట్లున్నది; అందు కృతకృత్యు డాయెను.

8 - 9 అక్రోధము - అహింస

క్రోధము నణగదొక్కకున్న క్షమ ఉద్రేకింపదు. స్నేహము, మమత, ప్రేమయున్నూ విన్యాసము చెందినట్లైతే క్రోధము తనంతనే ఉడిగిపోవును. క్రోధమునకు తగిన విరుగడు ప్రేమయే. ఇందుచేతనే హిందూగృహమం దక్రోధము నభ్యసించుటకు తగిన పరిస్థితు లేర్పరచి యుండును; ఋషి ప్రతిష్ఠితమగు నచ్చోటు దేవత్వము సాధించుటకు ముఖ్యావ